రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్(PRABHAS) హీరోగా నటిస్తోన్న హర్రర్ కామెడీ చిత్రం ‘ది రాజాసాబ్’(RajaSaab) నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ జూన్ 16న విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
- Advertisement -
ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ చిత్రాల్లో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్నారు.



