The RajaSaab: ప్రభాస్.. ఒకప్పుడు టాలీవుడ్ హీరో. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. ప్రభాస్ ఫొటో పోస్టర్‌పై కనిపిస్తే చాలు ఓపెనింగ్ రోజే సినిమా బిజినెస్ మొత్తం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఓటీటీ, థియేట్రికల్, శాటిలైట్ ఏదైనా రికార్డులు బద్దలవ్వాల్సిందే. ప్రభాస్ క్రేజ్ అలాంటిది. కానీ రాజాసాబ్ విషయంలో మాత్రం సీన్ రివర్స్‌గా ఉంది. రాజాసాబ్ ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదట. రాజాసాబ్ తర్వాత మొదలైన ఫౌజీ సగం కూడా షూటింగ్ కాకముందే రికార్డు ధరకు ఓటీటీ డీల్ ముగిసింది. రాజాసాబ్ రిలీజ్‌కు మరో రెండు నెలలే టైమ్ ఉంది. కానీ ఓటీటీ రైట్స్ అమ్ముడుకాకపోవడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రాజాసాబ్ ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడానికి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎదుర్కొంటున్న ఓ లీగల్ ఇష్యూనే కారణమట. నిజానికి రాజాసాబ్ ఓటీటీ రైట్స్ కొనేందుకు టాప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అన్ని పోటీపడ్డాయి. చివరకు 200 కోట్లకు జియో హాట్ స్టార్ ఓటీటీ రైట్స్‌ను కొనేందుకు రెడీ అయ్యిందట. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరాయట. కానీ చివరి నిమిషంలో ఓ చిక్కొచ్చిపడటంతో ప్రస్తుతం ఈ ఓటీటీ డీల్ పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
ముంబాయికి చెందిన ఓ సంస్థ వద్ద రాజాసాబ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ 250 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారట. ఈ ఫైనాన్స్ మ్యాటర్ కాస్త వివాదంగా మారి కోర్టు వరకు వెళ్లింది.
Also Read – Nandamuri Balakrishna: ‘అఖండ 2’ ఓటీటీ డీల్ అందుకే క్లోజ్ అవలేదా..?
రాజాసాబ్ ఓటీటీ అమ్మకాలు జరగాలంటే ఆ ఫైనాన్స్ సంస్థ ఎన్‌వోసీ ఇవ్వాలట. తమ డబ్బులు చెల్లిస్తేనే ఎన్‌వోసీ ఇస్తామని సదరు ఫైనాన్స్ సంస్థ మొండికేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మ్యాటర్‌ను సెటిల్ చేసుకునేందుకు ఫైనాన్స్ సంస్థతో విశ్వ ప్రసాద్ గత కొద్ది రోజులుగా బేరసారాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ సమస్య సాల్వ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రాజాసాబ్ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ హిందీతో మలయాళంలో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Dacoit: రాకింగ్ స్టార్ యష్ వర్సెస్ అడివి శేష్… ఉగాది బాక్సాఫీస్ పోరు!


