The Rajasaab Teaser: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. దర్శకుడు మారుతి దర్శకత్వంలో హర్రర్ కామెడీగా తెరెకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ టీజర్ విడులైంది. ఈ టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. డార్లింగ్ స్టైలిష్ లుక్, డైలాగ్స్ ఆకట్టుకుంటున్నారు. ఇటీవల వరుస పాన్ ఇండియా సినిమాలతో సీరియస్ లుక్ లో నటిస్తున్న ప్రభాస్.. ఈ టీజర్ లో తనలోని కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. మొత్తానికి దర్శకుడు మారుతి.. ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చాడు. రాజమహల్ చుట్టూ జరిగే కథ, హర్రర్ సీన్స్, కామెడీ అదిరిపోయాయి
ఈ మూవీలో పాటలు, ఫైట్స్, కామెడీ, డ్యాన్స్, రొమాన్స్ తో ఫుల్ మీల్స్ లా అభిమానులను అలరించనున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్ పోస్టర్లు మూవీపై క్యూరియాసిటీ పెంచగా.. తాజాగా విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలు పెంచేసింది. తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ప్రభాస్ హర్రర్ మూవీలో నటించడం విశేషం. ఫ్యాన్స్ ఎలా చూడాలని ఇన్నేళ్లుగా కోరుకుంటున్నారో అలా ఈ సినిమాలో కనిపించాడు.
దీంతో ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5న మూవీని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక పీపుల్స్ మీడియా బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించగా.. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్లు కథానాయికలుగా నటించారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు ‘ఫౌజీ’ మూవీలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీలో త్వరలోనే నటించనున్నాడు.
The Rajasaab Teaser: ఫ్యాన్స్ కు పూనకాలే.. వింటేజ్ ప్రభాస్ ఈజ్ బ్యాక్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES