Dude Trailer: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న డ్యూడ్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బైలింగ్వల్ మూవీతో కీర్తిశ్వరన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
డ్యూడ్ ట్రైలర్‌ను గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. యూత్‌ను అట్రాక్ట్ చేసే అంశాలతో ట్రైలర్ ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. ప్రదీప్ మ్యానరిజమ్స్, ఆటిట్యూడ్, అతడు చెప్పిన డైలాగ్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
పెళ్లంటే పిల్ల ఉండదు…
లైఫ్‌లో ఒక విషయాన్ని లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తే… లైఫ్ నిన్ను లెఫ్ట్ హ్యాండ్‌తో డీల్ చేస్తూ అంటూ ప్రదీప్ రంగనాథన్ చెప్పిన డైలాగ్‌తో ఇంట్రెస్టింట్‌గా ట్రైలర్ ప్రారంభమైంది. ఏంట్రా నీ కథ పెళ్లంటే పిల్ల ఉండదు. పిల్ల ఉంటే పెళ్లి అవ్వదు… పక్కోడి ఫీలింగ్స్‌ను క్రింజ్‌గా చూడటమే ఇప్పుడు ట్రెండ్ అనే డైలాగ్స్ ట్రైలర్‌లో సరదాను పంచాయి.
Also Read – Pranavi Manukonda: హాట్ ఫోటోషూట్ తో రెచ్చగొడుతున్న హైదరాబాద్ అమ్మాయి
వంద మంది వచ్చినా…
ఈ బాడీ ఏసుకొని గొడవలకు వెళుతున్నావే… ఓ పది మంది వస్తే కొట్టగలవా అని హీరోయిన్ అడగ్గా… వంద మంది వచ్చినా కొట్టించుకోగలను అంటూ హీరో చెప్పిన సమాధానం నవ్వులను పూయిస్తుంది. ఇక్కడ జరిగేది ఏది మన చేతిలో లేదు. దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అన్నదే మన చేతిలో ఉంటుంది. బాగుంటే ఇద్దరి లైఫ్ బాగుండాలి లేదంటే ఇద్దరం నాశనం కావాలి అనే పంచ్‌లు ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి.
డీజే టిల్లు బ్యూటీ…
యాక్షన్, కామెడీ, లవ్‌కు ప్రాధాన్యమిస్తూ దర్శకుడు కీర్తిశ్వరన్ డ్యూడ్ మూవీని తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి కనిపించింది. నేహా శెట్టి ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ఇన్నాళ్లుగా సీక్రెట్‌గా దాచారు. ఈ ట్రైలర్‌లో ట్విస్ట్ రివీలైంది.
డ్యూట్ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రదీప్ రంగనాథన్ మరో హిట్టు కొట్టేలా ఉన్నాడని నెటిజన్లు ట్రైలర్‌ను ఉద్దేశించి కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
లవ్ టుడే, డార్లింగ్ సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఈ రెండు సినిమాలు తెలుగులో మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ దీపావళికి డ్యూడ్‌తో పాటు కిరణ్ అబ్బవరం కే ర్యాంప్, సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా, ప్రియదర్శి మిత్రమండలి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
Also Read – Pujita Ponnada: అందానికే అసూయ పుట్టే అందం.. పూజిత సొంతం..


