Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభPradeep Ranganathan : ఈ యువ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా??

Pradeep Ranganathan : ఈ యువ డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా??

- Advertisement -

Pradeep Ranganathan : ఇటీవల లవ్ టుడే సినిమాతో అటు తమిళ్ ప్రేక్షకులని, ఇటు తెలుగు ప్రేక్షకులని కూడా మెప్పించాడు యువ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్. తనే హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు. చాలా చిన్న బడ్జెట్ లో చిన్న సినిమాగా తెరకెక్కిన లవ్ టుడే తమిళ్, తెలుగులో భారీ విజయం సాధించి 50 కోట్లకి పైగా కలెక్షన్స్ ని రప్పించింది.

ఈ సినిమా పాటలు, డైలాగ్స్, సీన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. యూత్ అంతా లవ్ టుడే సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు. గతంలో ప్రదీప్ తీసిన కోమలి సినిమా కూడా మంచి విజయం సాధించింది. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఎలాంటి దర్శకత్వ అనుభవం లేకుండానే డైరెక్ట్ గా సినిమాలు తీసి మంచి విజయం సాధించడంతో అందరి చూపు ప్రదీప్ వైపు పడింది.

అయితే ప్రదీప్ కి ఈ సారి ఏకంగా రజినీకాంత్ తో సినిమా చేసేందుకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఇంకా ఏ సినిమా ఓకే చేయలేదు. రజిని డేట్స్ లైకా సంస్థ వద్ద ఉన్నాయి. దీంతో లైకా వాళ్ళు ప్రదీప్ రంగనాథన్ ని పిలిచి రజినీకాంత్ కోసం స్టోరీ రెడీ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఇది నిజమైతే ప్రదీప్ కి సూపర్ ఛాన్స్ వచ్చినట్టే. ఇటీవల లవ్ టుడే సినిమా హిట్ అయ్యాక ప్రదీప్ ని పిలిచి రజినీకాంత్ అభినందించారు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News