Saturday, November 15, 2025
HomeTop StoriesLIK: ఒకే ఏడాదిలో మూడు వంద కోట్ల సినిమాలతో ప్రదీప్ రంగనాథన్?

LIK: ఒకే ఏడాదిలో మూడు వంద కోట్ల సినిమాలతో ప్రదీప్ రంగనాథన్?

Pradeep Ranganathan: కోలీవుడ్ నుంచి వచ్చి.. తెలుగు ప్రేక్షకులను ‘లవ్ టుడే’ తో మెస్మరైజ్ చేసిన హీరో, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్. అతని స్పీడ్ చూస్తుంటే పాత రికార్డులన్నీ బద్దలయ్యేలా ఉన్నాయి. కేవలం నటుడిగా కొన్ని సినిమాల అనుభవం ఉన్నా.. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరి, అరుదైన హ్యాట్రిక్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరుకు ఇలాంటి రికార్డు ఏ హీరో కి లేకపోవడం విశేషం.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/upasana-twins-rumours-allu-family-missing-mega-event/

ఆల్రెడీ డబుల్ సెంచరీ కంప్లీట్!

నిజం చెప్పాలంటే, ప్రదీప్ రంగనాథన్ జోరు 2025లో మాములుగా లేదు. ఈ ఏడాదిలోనే అతని రెండు సినిమాలు రూ. 100 కోట్ల మార్క్‌ను దాటాయి

1. డ్రాగన్: సంవత్సరం మొదట్లో విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సాధించింది. వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ. 150 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ ఏడాది అతని తొలి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
2. డ్యూడ్: దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చినా, కేవలం 6 రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి.. ప్రదీప్‌కి వరుసగా మూడవ సెంచరీని అందించింది. దీంతో ప్రదీప్ రంగనాథన్.. తన మొదటి మూడు సినిమాలను వంద కోట్ల క్లబ్‌లో చేర్చిన అతి కొద్ది మంది హీరోల జాబితాలోకి ఎక్కాడు.

ఆ ట్రిపుల్ సెంచరీ రికార్డు కొడతాడా?

ఇప్పుడు అందరి దృష్టి.. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమా ‘LIK’ (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) పైనే ఉంది. LIK సినిమాకు ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ.. 2025 చివర్లో డిసెంబర్ 18న విడుదల కాబోతోంది. 2025లో డ్రాగన్ 100 కోట్లు, డ్యూడ్ 100 కోట్లు 2 సెంచరీలు కొట్టేశాడు. LIK సినిమా కూడా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటితే.. ఒకే సంవత్సరంలో మూడు వంద కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోగా ప్రదీప్ రంగనాథన్ చరిత్ర సృష్టిస్తాడు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-fauji-kannada-actress-chaitra-j-achar-cast-update/

ప్రదీప్ ఫ్యాన్స్ ఈ ట్రిపుల్ సెంచరీ రికార్డు కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారు. యూత్‌ను ఆకట్టుకునే కథాంశాలు, తనదైన ఫ్రెష్ పెర్ఫార్మెన్స్‌తో ప్రదీప్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్నాడు. విఘ్నేష్ శివన్ లాంటి డైరెక్టర్‌తో కలిసి చేస్తున్న LIK సినిమా కూడా అంచనాలను అందుకొని, 2025ను ప్రదీప్ రంగనాథన్ సంవత్సరంగా మారుస్తుందో లేదో చూడాలంటే డిసెంబర్ వరకు ఆగాల్సిందే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad