Prakash Raj: నేషనల్ అవార్డులపై గత కొన్నాళ్లుగా విమర్శలు వస్తోన్నాయి. ప్రతిభావంతులను విస్మరిస్తూ లాబీయింగ్, పొలిటికల్ పార్టీలకు సపోర్ట్‌గా ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకే అవార్డులను ఇస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నేషనల్ అవార్డుల ఎంపిక సరిగ్గా లేదంటూ గతంలో పలువురు స్టార్స్ కామెంట్స్ చేశారు. తాజాగా దిగ్గజ నటుడు ప్రకాష్ రాజ్ ఈ లిస్ట్‌లో చేరారు. పక్షపాతంతో తీసుకుంటున్న నిర్ణయాల వల్లే జాతీయ స్థాయిలో కొందరికి మాత్రమే అవార్డులు దక్కుతున్నాయని, ప్రతిభావంతులకు అన్యాయం జరుగుతోందని ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు.
Also Read- Ram Charan: అసలు ఏం వండుతున్నారో చెప్పండి.. ‘పెద్ది’ సాంగ్ అప్‌డేట్‌పై రామ్ చరణ్ రిక్వెస్ట్
సోమవారం కేరళ ప్రభుత్వం స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. కేరళ స్టేట్ అవార్డుల జ్యూరీ కమిటీకి ప్రకాష్ రాజ్ చైర్ పర్సన్‌గా వ్యవహరించారు. అవార్డుల ప్రకటన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో జాతీయ అవార్డులపై ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘స్టేట్ అవార్డుల ఎంపిక కోసం అనుభవజ్ఞులైన బయటి వ్యక్తులు కావాలని కేరళ కమిటీ వాళ్లు నాకు ఫోన్ చేశారు. అవార్డుల ప్రకటనలో తాము జోక్యం చేసుకోమని చెప్పారు. అవార్డుల ఎంపికలో ఎలాంటి పక్షపాత ధోరణులు లేకుండా వారు తీసుకున్న నిర్ణయం నచ్చి చైర్ పర్సన్‌గా ఉండటానికి అంగీకరించాను. జాతీయ అవార్డుల ఎంపిక కూడా ఈ తీరుగా జరగడం లేదు. పక్షపాతంతో జ్యూరీ సభ్యులు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందువల్ల కొందరికి మాత్రమే జాతీయ అవార్డులు వస్తున్నాయి. ఇలాంటి జ్యూరీలతో పాటు ప్రభుత్వాలు ఉన్నంత వరకు మమ్ముట్టి లాంటి గొప్ప నటులకు జాతీయ అవార్డులు అవసరం లేదు’’ అని ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేశారు. ఫైల్స్ లాంటి సినిమాలు తీస్తున్న వారికే నేషనల్ అవార్డులు ఇస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
పాన్ ఇండియన్ మోజు కారణంగా మంచి కంటెంట్‌తో కూడిన సినిమాలు రావడం తగ్గిపోయిందని ప్రకాష్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ అవార్డుల గురించి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ అన్ని ఇండస్ట్రీలలో చర్చనీయాంశంగా మారాయి. కాగా స్టేట్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్‌గా భ్రమయుగం సినిమాకుగాను మమ్ముట్టి అవార్డును అందుకున్నారు. మంజుమ్మల్ బాయ్స్ మూవీకి మొత్తం 11 అవార్డులు వచ్చాయి.


