Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభPrakash Raj: మతోన్మాదులు, ఇడియట్స్, మొరిగే కుక్కలు..మళ్లీ నోరుపారేసుకున్న ప్రకాష్ రాజ్

Prakash Raj: మతోన్మాదులు, ఇడియట్స్, మొరిగే కుక్కలు..మళ్లీ నోరుపారేసుకున్న ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడుగా ప్రఖ్యాతిగాంచిన ప్రకాష్ రాజ్ మళ్లీ తన నోటికి పనిచెప్పారు. పఠాన్ పై వచ్చిన వివాదాలు, బాయ్ కాట్ పై తాజాగా మళ్లీ స్పందించిన ఆయన.. మతోన్మాదులు, ఇడియట్స్, మొరిగే కుక్కలు అంటూ మండిపడ్డారు. సినిమా రిలీజ్ కు ముందు బాయ్ కాట్ అనేవాళ్లంతా మొరిగే కుక్కలు మాత్రమేనని కరవవన్నారు ప్రకాష్.

- Advertisement -

“పఠాన్ సినిమాను వాళ్లు బ్యాన్ చేయాలనుకున్నారు.. చివరికి ఏమైంది ఈ సినిమా 700 కోట్ల కలెక్షన్స్ తో దూసుకుపోతోంది..పఠాన్ ను బ్యాన్ చేయాలనుకున్నవారు మోడీ సినిమాను ఆడనివ్వలేద”ని బీబీసీ డాక్యుమెంటరీని పరోక్షంగా ప్రస్తావించారు. ద కశ్మీర్ ఫైల్స్ పై విరుచుకుపడ్డ ప్రకాష్ రాజ్ “అదో నాన్సెన్స్ సినిమా” అంటూ నిప్పులు చెరిగారు. కేరళలో మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన తన స్టైల్లో మాట్లాడారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad