Prashanth Varma: టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన విషయం… దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాతల మధ్య మొదలైన అడ్వాన్స్ వివాదం. ‘అ!’ సినిమాతో మొదలుపెట్టి, ‘జాంబీ రెడ్డి’, ముఖ్యంగా ‘హను-మాన్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన ప్రశాంత్ వర్మ, ఇప్పుడు పెద్ద సమస్యలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది.
భారీ విజయం… రికార్డు అడ్వాన్సులు
‘హను-మాన్’ సినిమా ఊహించని విజయం సాధించడం, అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో తీసి భారీ లాభాలు తీసుకురావడంతో, ఇండస్ట్రీ దృష్టి పూర్తిగా ప్రశాంత్ వర్మపై పడింది. ‘హనుమాన్’ హిట్ తర్వాత, దాదాపు 10 మందికి పైగా పెద్ద, చిన్న నిర్మాతలు ప్రశాంత్ వర్మతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో ప్రశాంత్ వర్మ లెక్కకు మించి అడ్వాన్సులు తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం అడ్వాన్స్ సుమారు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్, డి.వి.వి. దానయ్య, నిరంజన్ రెడ్డి వంటి పెద్ద సంస్థలతో పాటు కొత్త నిర్మాతలు కూడా ఉన్నారంట.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/kantara-chapter-1-kotha-lokah-ott-release-today/
వివాదానికి కారణం!
ఒక స్టార్ డైరెక్టర్ 10 మందికి ఒకేసారి సినిమా చేయడం అనేది అసాధ్యం. ఇచ్చిన మాట ప్రకారం తమ సినిమాను వెంటనే మొదలుపెట్టాలని నిర్మాతలు ఒత్తిడి తేవడంతో వివాదం మొదలైంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రశాంత్ వర్మ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు. “నేను దర్శక పర్యవేక్షణ చేస్తాను. నా శిష్యులు ఆ సినిమాలను డైరెక్ట్ చేస్తారు. కథ మాత్రం నాదే” అని చెప్తున్నాడు అంటా. దీనికి నిర్మాతలు ఒప్పుకోవడం లేదు. తాము డబ్బు ఇచ్చింది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కోసమే తప్ప, పర్యవేక్షణ కోసం కాదని గట్టిగా చెబుతున్నారంట. అందుకే తమ అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
డబ్బు ఎక్కడికి పోయింది? కౌన్సిల్‌లో ఫిర్యాదు?
నిజానికి ప్రశాంత్ వర్మ ఆ అడ్వాన్స్ డబ్బులతో తనకంటూ ఒక పెద్ద స్టూడియో హైదరాబాద్‌లో నిర్మించుకోవడానికి స్థలం కొని పెట్టుబడి పెట్టాడంట. అందుకే ఇప్పుడు ఒకేసారి అంత పెద్ద మొత్తంలో డబ్బు తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో రాజీ కుదరకపోతే, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో అధికారికంగా కంప్లైంట్ చేస్తామని నిర్మాతలు హెచ్చరిస్తున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తుంది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/baahubali-the-epic-review-telugu/
ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తన డ్రీమ్ ప్రాజెక్టులైన ‘జై హనుమాన్’, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘మహకాళి’ తో చాలా బిజీగా ఉన్నాడు. ఈ అడ్వాన్సుల వివాదం ‘జై హనుమాన్’ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.


