Dragon: ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ ఆగిపోయినట్లు కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో జోరుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్‌తో ఏర్పడిన విభేదాల కారణంగా డ్రాగన్ ను ఎన్టీఆర్ పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజీ విషయంలో ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని వార్తలొస్తున్నాయి. డ్రాగన్ మూవీని అనౌన్స్ చేసి నాలుగేళ్లు దాటింది. ఇప్పటివరకు ఎన్టీఆర్ కేవలం ఇరవై రోజులు మాత్రమే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. డ్రాగన్ డిలేకు ఎన్టీఆర్ కారణమనే అభిప్రాయంలో ప్రశాంత్ నీల్ ఉన్నాడట బాలీవుడ్ మూవీ వార్ 2 కోసం డ్రాగన్ షూటింగ్‌కు నాలుగైదు నెలలు బ్రేక్ ఇచ్చాడు ఎన్టీఆర్. అక్టోబర్‌లోనే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా… యాడ్ షూటింగ్‌లో ఎన్టీఆర్ గాయపడటంతో డిలే మరికాస్త పెరిగింది. ప్రతిసారి ఏదో ఒక సమస్య తలెత్తుతుండటంతో డ్రాగన్ వస్తుందా? లేదా? అనే డైలమా అభిమానుల్లో మొదలైంది.
డ్రాగన్ ఆగిపోయిందంటూ వస్తున్న పుకార్లపై ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌తో పాటు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ రూమర్స్ అంత నిజమేనని అనుకున్నారు. ఎట్టకేలకు ఈ పుకార్లకు ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖితారెడ్డి పుల్‌స్టాప్ పెట్టింది.
భర్త ప్రశాంత్ నీల్‌తో దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది లిఖితారెడ్డి. ఈ ఫొటోకు ఎన్టీఆర్ నీల్ మూవీ అప్‌డేట్ ఇవ్వమని చెప్పు వదిన అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. రైట్ టైమ్‌లోనే ఈ సినిమా వస్తుందంటూ ఆ నెటిజన్ కామెంట్‌కు లిఖితారెడ్డి రిప్లై ఇచ్చింది. ఆమె ఆన్సర్‌తో ఎన్టీఆర్ అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.
Also Read – Fauzi Story: ‘ఫౌజీ’ కథకు మూలమేంటో రివీల్ చేసిన హను రాఘవపూడి
డ్రాగన్ మూవీ షూటింగ్ నవంబర్ సెకండ్ వీక్ నుంచి తిరిగి మొదలు కాబోతుందట. నవంబర్ 8 లేదంటే 10 నుంచి నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో మొదలవ్వనున్న ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్ రుక్మిణి వసంత్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఇక నుంచి ఎలాంటి గ్యాప్ లేకుండా నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ను నిర్వహించనున్నారట. హైదరాబాద్ తర్వాత ఈ మూవీ షూటింగ్ ఆఫ్రికాలోని ట్యూనీషియాలో జరుగనున్నట్లు తెలిసింది. లొకేషన్స్ రెక్కీ కోసం అక్టోబర్ 27న ప్రశాంత్ నీల్ ఆఫ్రికా వెళ్లబోతున్నాడట. నవంబర్ ఫస్ట్ వీక్‌లో తిరిగి హైదరాబాద్ వస్తాడని అంటున్నారు.
దాదాపు 300 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ డ్రాగన్ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జూన్ 25న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. డ్రాగన్‌లో మలయాళ యాక్టర్స్ టోవినో థామస్, బీజు మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read – SSMB29: క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన కీరవాణి తనయుడు..


