Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPrasanth Varma: ప్రభాస్ నో అంటే అల్లు అర్జున్ తో..?

Prasanth Varma: ప్రభాస్ నో అంటే అల్లు అర్జున్ తో..?

Prasanth Varma: సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ ఒక్కరూ ఊహించలేరు. ఓపెనింగ్ అయిన సినిమాలు కూడా మూలన పడ్డవి చాలా ఉన్నాయి. సగం సినిమా షూటింగ్ జరిగిన తర్వాత ఆగిపోయిన సినిమాలూ ఉన్నాయి. ఇక కొన్ని సినిమాలు ల్యాబ్ నుంచి బయటకి రానివి, పలు కారణాల వల్ల కాంబినేషన్స్ మారిన సినిమాలు కొన్ని.. ఇలా చాలా ఊహించనవి జరుగుతుంటాయి. ఒక దర్శకుడు కథ ఒకరి కోసం రాసుకొని ఇంకోకరితో చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

- Advertisement -

అలా, ఇప్పుడు ప్రభాస్ తో అనుకొని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట ఓ యంగ్ డైరెక్టర్. అతనెవరో కాదు, ప్రశాంత్ వర్మ. అ. సినిమాతో దర్శకుడిగా మారిన ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో అగ్ర దర్శకుడి రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అనే రేంజ్ కి వెళ్ళాడు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో నటిస్తున్నాడు.

Also Read – KGF 3: క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది

అయితే, ఇటీవల ప్రశాంత్ నీల్.. ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీగా స్క్రిప్ట్ ఉన్నట్టుగా చెప్పాడు. డార్లింగ్ డేట్స్ ఇవ్వాలే గానీ, సినిమాను వెంటనే మొదలు పెట్టగలను అని కూడా ఎంతో నమ్మకంగా ధీమాగా చెప్పాడు. కానీ, ఇప్పుడు కొత్త మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ది రాజాసాబ్ త్వరలో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీని తర్వాత ఫౌజీ లైన్ లో ఉంది. ఆ తర్వాత సలార్ 2, కల్కీ 2.. ఇలా డార్లింగ్ కి గ్యాప్ లేదు.

ఇది అర్థమయ్యే అనుకుంటా, ప్రశాంత్ వర్మ ఒకవేళ ప్రభాస్ డేట్స్ గనక దొరకకపోతే, అల్లు అర్జున్ తో చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట. ఇదే స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి బన్నీకి చెప్పడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 22వ సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాత ఎవరితో ప్రాజెక్ట్ ఉంటుందనేది క్లారిటీ లేదు. ఒకవేళ స్క్రిప్ట్ నచ్చితే, బన్నీ ప్రశాంత్ వర్మకి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read – Ntr – Yash: రామ్‌చ‌ర‌ణ్‌తో య‌శ్ బాక్సాఫీస్ క్లాష్‌ – క్లైమాక్స్‌కు చేరిన టాక్సిక్ షూటింగ్ – థియేట‌ర్ల‌లో పూన‌కాలే

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad