Prequel: ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సీక్వెల్స్ సినిమాల హవా నడుస్తోంది. ఇదివరకు ఎంత పెద్ద కథ అయిన సింగిల్ పార్ట్‌లోనే చెప్పేవారు డైరెక్టర్లు. ఇప్పుడు ట్రెండ్ మారింది. సీక్వెల్స్ పేరుతో ఓ కథను రెండు, మూడు భాగాలుగా స్క్రీన్‌పై ఆవిష్కరిస్తున్నారు. కల్కి 2, దేవర 2, సలార్ 2 తెలుగులో చాలానే సీక్వెల్ మూవీస్ రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్‌తో పాటు తాజాగా టాలీవుడ్‌లో ప్రీక్వెల్ ట్రెండ్ కూడా మొదలైంది. ఓ కథకు ముందు ఏం జరిగిందో ఈ ప్రీక్వెల్ మూవీస్‌లో చూపిస్తుంటారు. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ వన్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కాంతార స్ఫూర్తితో పలువురు టాలీవుడ్ డైరెక్టర్లు కూడా ప్రీక్వెల్ కథలను రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్స్ కూడా ఈ ప్రీక్వెల్ కథల్లో కనిపించబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తున్నాయి.
ఓజీ ప్రీక్వెల్…
పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా సినిమా 360 కోట్లకుపైనే వసూళ్లను దక్కించుకున్నది. ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. ఓజీ మూవీకి ప్రీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ సుజీత్ ప్రకటించాడు. ఈ ప్రీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన తనయుడు అకీరానందన్ హీరోలుగా నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నానితో సుజీత్ ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఓజీ ప్రీక్వెల్ మొదలవుతుందని సమాచారం.
Also Read – Nithiin: ఫ్లాప్ హీరోతో లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ – లిమిటెడ్ బడ్జెట్‌లో ప్రయోగం
ప్రభాస్ ఫౌజీ..
ఈ ప్రీక్వెల్ ట్రెండ్‌లోకి ప్రభాస్ ఫౌజీ కూడా చేరినట్లు టాక్. హనురాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ యాక్షన్ లవ్ డ్రామాగా ఫౌజీ రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయ్యింది. ఫౌజీ వచ్చే ఏడాది ఆగస్ట్‌లో రిలీజ్ కానున్నట్లు టాక్. ఫౌజీకి ప్రీక్వెల్ కథను కూడా దర్శకుడు హను రాఘవపూడి సిద్ధం చేశాడట. ఫౌజీ మూవీ క్లైమాక్స్‌లో ఈ ప్రీక్వెల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కట్టప్ప పాత్రతో…
టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ బాహుబలికి ప్రీక్వెల్ మూవీ రానున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కట్టప్ప క్యారెక్టర్ నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ ఉంటుందని సమాచారం. విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీకి బింబిసారకు ప్రీక్వెల్‌ను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు అనిల్ పాడూరి దర్శకత్వం వహించబోతున్నాడు.
విజయ్ దేవరకొండ కింగ్డమ్‌కు ప్రీక్వెల్‌గా ఓటీటీ సినిమా చేసే ప్లాన్‌లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఉన్నాడు. వీటితో పాటు మసూద, భగవంత్ కేసరితో పాటు మరికొన్ని ప్రీక్వెల్ మూవీస్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
Also Read – Mukesh Ambani: ఆ గుడికి రూ. 10 కోట్లు విరాళం ప్రకటించిన కుబేరుడు


