Premante: ముందు కమెడియన్‌గా బాగా పేరు తెచ్చుకుని, ‘బలగం’ సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టిన ప్రియదర్శి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ‘కోర్ట్’ సినిమా పర్వాలేదనిపించినా, ఆ క్రెడిట్ మొత్తం నాని, పిల్లల పాత్రలకు దక్కింది తప్ప ప్రియదర్శికి పెద్దగా రాలేదు. అందుకే, తన నటనకు తగ్గట్టుగా, మంచి కథ ఉన్న ఒక హిట్ కోసం ప్రియదర్శి చూస్తున్నాడు. ఈ సమయంలోనే, కొత్తగా వచ్చిన ‘ప్రేమంటే’ సినిమా టీజర్ చూస్తుంటే.. ఈసారి ప్రియదర్శికి సరిపోయిన కథ దొరికిందని, సినిమాతో హిట్ కొట్టడం పక్కా అని అనిపిస్తోంది. ఈ సినిమా నవంబర్ 21న రిలీజ్ కాబోతుంది.
ALSO READ: Pradeep Ranganadhan: ‘డ్యూడ్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
‘ప్రేమంటే’ టీజర్ చూస్తే, ఇది యూత్‌కు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇద్దరికీ నచ్చే విధంగా ఉంది. ‘పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత’ జరిగే గొడవలు, పెళ్లి చుట్టూ కథ నడుస్తుంది. పెళ్లి చేసుకుంటే థ్రిల్ ఉండాలి అనుకునే అమ్మాయికి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలనుకునే అబ్బాయి మధ్య జరిగే కథే ఈ సినిమా. మనం ఇలాంటి పెళ్లి కథలు చాలా చూసినా, ఈ టీజర్‌లో చూపించిన కొత్త పాయింట్ బాగా ఆసక్తిగా ఉంది.. నవనీత్ శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ALSO READ: Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్, ‘డ్రాగన్’ మూవీ రెండు భాగాలుగా!
ఈ సినిమాలో హీరోయిన్‌గా ఆనంది నటిస్తోంది. యాంకర్ సుమ కనకాల కూడా ఇందులో హెడ్ కానిస్టేబుల్ గా ఒక కీ రోల్ లో కనిపించబోతుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది అనిపిస్తుంది. మొత్తానికి, కామెడీ, ఎమోషన్ రెండూ బాగా కుదిరినట్టు కనిపిస్తున్న ఈ ‘ప్రేమంటే’ సినిమాతో ప్రియదర్శి మళ్లీ ఫామ్‌లోకి రావడం కన్ఫర్మ్ అనిపిస్తుంది. ‘ప్రేమంటే’ ఆడియన్స్ ని బాగా ఎంటర్‌టైన్ చేసి, నవ్వించగలిగితే.. ప్రియదర్శికి మరో సాలిడ్ హిట్ పడినట్లే.


