Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభPriyanka Arul Mohan: స్క్విడ్ గేమ్ యాక్ట‌ర్‌తో ఓజీ హీరోయిన్ మూవీ - టైటిల్ ఇదే...

Priyanka Arul Mohan: స్క్విడ్ గేమ్ యాక్ట‌ర్‌తో ఓజీ హీరోయిన్ మూవీ – టైటిల్ ఇదే – నేరుగా ఓటీటీలో రిలీజ్‌

Priyanka Arul Mohan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ప్రియాంక కెమిస్ట్రీకి మంచి మార్కులే ప‌డ్డాయి. ఓజీతో కెరీర్‌లోనే పెద్ద విజ‌యాన్ని అందుకున్న ప్రియాంక అరుళ్ మోహ‌న్ తాజాగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. ఆమె నెక్స్ట్ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

మేడ్ ఇన్ కొరియా…
ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా ఆర్ఏ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ కామెడీ డ్రామా మూవీ రూపొందింది. ఈ సినిమాకు మేడ్ ఇన్ కొరియా అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేశారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. త‌మిళం, తెలుగులో పాటు మ‌రో రెండు భాష‌ల్లో రిలీజ్ కానుంది.

Also Read – Diwali 2025: దీపావళి నాడు పవర్ పుల్ యోగం.. ఈ 3 రాశులవారు నక్కతోక తొక్కినట్లే..

స్క్విడ్ గేమ్ యాక్ట‌ర్‌…
మేడ్ ఇన్ కొరియా మూవీలో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ యాక్ట‌ర్ పార్క్ హై జిన్ కీల‌క పాత్ర పోషించారు. కొరియా వెళ్లిన ఓ ఇండియ‌న్ యువ‌తికి అక్క‌డ ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? ఆమె జీవితంలోకి వ‌చ్చిన కొత్త వ్య‌క్తులు ఎవ‌రు అనే అంశాల‌తో ఫ‌న్ ఎమోష‌న‌ల్ డ్రామాగా మేడ్ ఇన్ కొరియా మూవీ రూపొందుతోంది.
మేడ్ ఇన్ కొరియా మూవీ నుంచి ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఫ‌స్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. కొరియ‌న్ వీధుల్లో న‌డుచుకుంటూ వ‌స్తున్న‌ట్లుగా డిజైన్ చేసిన ఈ ఫ‌స్ట్ లుక్ ఆస‌క్తిని పంచుతోంది. డిసెంబ‌ర్‌లో మేడ్ ఇన్ కొరియా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఓటీటీలో ప్రియాంక చేస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం.

నాని గ్యాంగ్‌లీడ‌ర్‌తో…
ఓజీ కంటే ముందు తెలుగులో నాలుగైదు సినిమాలు చేసింది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. నాని గ్యాంగ్‌లీడ‌ర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత నానితోనే స‌రిపోదా శ‌నివారం సినిమా చేసింది. శ‌ర్వానంద్ శ్రీకారంలోనూ క‌థానాయిక‌గా క‌నిపించింది. తెలుగుతో పాటు త‌మిళంలో ప‌లు భారీ బ‌డ్జెట్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
మేడ్ ఇన్ కొరియా డైరెక్ట‌ర్ ఆర్ఏ కార్తీక్ ప్ర‌స్తుతం తెలుగులో నాగార్జున‌తో ఓ సినిమా చేస్తున్నాడు. నాగార్జున కెరీర్‌లో వందో మూవీగా తెర‌కెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ ఇటీవ‌లే లాంఛ్ అయ్యింది. ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ట‌బు కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నాగ‌చైత‌న్య‌, అఖిల్ గెస్ట్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Also Read – Bigg Boss Sreeja: బిగ్ బాస్ లో దమ్ము శ్రీజ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad