Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభSSMB 29: షాకింగ్ అప్‌డేట్..మందాకిని ఫస్ట్ లుక్ రివీల్

SSMB 29: షాకింగ్ అప్‌డేట్..మందాకిని ఫస్ట్ లుక్ రివీల్

SSMB 29 : దర్శక ధీరుడు చెప్పినట్టుగానే గ్లోబ్ ట్రోటర్ నుంచి వరుసగా షాకింగ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాత్రను రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె మందాకిని గా కనిపించబోతుండగా, ఇప్పుడు ఫస్ట్ లుక్ రివీల్ అయింది. సూపర్ స్టార్ మహేస్ బాబు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

సినిమా మేకింగ్ విషయంలో గానీ, ఆ సినినిమా అప్‌డేట్స్ ఇచ్చే విషయంలో గానీ, సౌత్ లో రాజమౌళి పాటించే స్ట్రాటజీ మరో దర్శకుడు పాటించలేరన్న మాట ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. బాహుబలి సిరీస్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో మన తెలుగు సినిమా స్థాయిని ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్ళిన ఘనత ఒక్క రాజమౌళీకే దక్కింది. మొత్తంగా మన ఇండియన్ సినిమా పవర్ ఏంటో హాలీవుడ్ మేకర్స్ కి చూపించారు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్‌టిర్ లాంటి వారికి పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని తెచ్చిపెట్టిన రాజమౌళి, ఇప్పుడు మహేష్ ని ఏకంగా మరో లెవల్ కి తీసుకెళ్ళబోతున్నారు.

రాజమౌళి సినిమా అంటే ప్రపంచ స్థాయిలో ఉండే అంచనాలకి రెట్టింపు స్థాయిలోనే, ఇప్పుడు ఆయన గ్లోబ్ ట్రోటర్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వలేదు. సాధ్యమైనంతవరకూ సెట్స్ నుంచి కూడా ఎలాంటి లీకులు రాకుండానే అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకటి అరా వచ్చి క్యూరియాసిటీని పెంచాయి తప్ప..ఫ్యాన్స్ ఆశించిన అప్‌డేట్స్ మాత్రం ఇప్పుడే మొదలయ్యాయి.

ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి ఎవరూ ఊహించని గెస్టులు హాజరవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పృథ్విరాజ్ సుకుమారన్ కి సంబంధించిన కుంభ పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత శృతి హాసన్, కాల భైరవ పాడిన సంచారి పాటను రిలీజ్ చేశారు. ఆ వెంటనే ప్రియాంక చోప్రా నటిస్తున్న పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి రాజమౌళి షాకిచ్చాడు. చక్కగా చీరకట్టులో యాక్షన్ సీన్స్ లో పాల్గొన్న సందర్భంలో ప్రియాంక ఎలా ఉంటుందనే హింట్ ఇస్తూ మందాకినీ పాత్రను పోషిస్తున్న విషయాన్ని అధికారికంగా కన్‌ఫర్మ్ చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.

ALSO READ : https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-the-girl-friend-movie-break-even-done-in-five-days/

ప్రస్తుతం దీనికి సంబందించిన మందానికి లుక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరి ఈ సినిమా నుంచి ఇంకెన్ని షాకింగ్ సర్‌ప్రైజెస్ ఉన్నాయో చూడాలి. అంతేకాదు, నిన్నటి వరకూ గ్లోబ్ ట్రోటర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తారని భావించారు. కానీ, ఇప్పుడు గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న వారణాసి ఫైనల్ టైటిల్ అని తెలుస్తోంది.

https://x.com/ssrajamouli/status/1988607547461579024?s=20

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad