Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAllu Aravind: నాకో స్థాయి ఉంది.. నేను స‌మాధానం చెప్ప‌ను.. బండ్ల గ‌ణేష్‌కు అల్లు అర‌వింద్...

Allu Aravind: నాకో స్థాయి ఉంది.. నేను స‌మాధానం చెప్ప‌ను.. బండ్ల గ‌ణేష్‌కు అల్లు అర‌వింద్ రిటార్ట్

Allu Aravind: నటుడి నుంచి నిర్మాత‌గా మారిన బండ్ల గ‌ణేష్ ఈ మ‌ధ్య ఏదైనా ఈవెంట్‌కు వ‌చ్చాడంటే ఏం మాట్లాడుతాడ‌నేది మీడియా ఆస‌క్తిగా ఎదురు చూస్తుంది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్‌లో మాట్లాడుతూ లాస్ట్ మినిట్‌లో వ‌చ్చి అర‌వింద్‌గారు క్రెడిట్ కొట్టేస్తార‌న్నా కానీ.. కె ర్యాంప్ స‌క్సెస్ మీట్‌లో వాట్స‌ప్ వాట్స‌ప్ గ‌య్స్ అంటే స‌క్సెస్ రాద‌ని ఇన్ డైరెక్ట్‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కామెంట్స్ చేసినా బండ్ల గ‌ణేష్‌కే చెల్లింది. ఆయ‌న కామెంట్స్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యాయి. నిన్న‌టి వ‌ర‌కు అల్లు అర‌వింద్ కానీ.. విజ‌య్ దేవ‌ర‌కొండ కానీ.. బండ్ల గ‌ణేష్ కామెంట్స్‌పై నోరు మెద‌ప‌లేదు. అయితే బుధ‌వారం జ‌రిగిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర‌వింద్ మీడియా ముఖంగా బండ్ల‌కు స్ట్రాంగ్ రిటార్డ్ ఇచ్చేశాడు.

- Advertisement -

Also Read – Allu Aravind: సరైనోడు 2పై కిరాక్ అప్‌డేట్ చెప్పిన అల్లు అర‌వింద్ – చ‌ర‌ణ్‌తో సినిమాపై క్లారిటీ

మీరు లాస్ట్ మూమెంట్‌లో వ‌చ్చిన క్రెడిట్ కొట్టేస్తారంటూ బండ్ల గ‌ణేష్ ఓ ఈవెంట్‌లో మీపై కామెంట్స్ చేశాడుగా.. దానికి మీరెలా స్పందిస్తారు అంటూ మీడియా అడిగిన దానికి అల్లు అర‌వింద్ స్పందిస్తూ ‘నాకో స్థాయి ఉంది. కాబ‌ట్టి నేను స‌మాధానం చెప్పాల‌నుకోవ‌టం లేదు’ అన్నారు. మరోసారి ఈ సీనియ‌ర్ ప్రొడ్యూసర్ ప‌రిస్థితుల‌ను ఎంత బాగా హ్యాండిల్ చేస్తాడ‌నేది ఈ ఘ‌ట‌న‌తో ప్రూవ్ అయ్యింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. సాధార‌ణంగా కొంద‌రు నిర్మాత‌లు ఏదో మాట్లాడ‌బోయి.. ఇంకేదో మాట్లాడేస్తారు. కానీ అర‌వింద్ చాలా నింపాదిగా, తెలివిగా స్పందించారు.

ఇక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విష‌యానికి వ‌స్తే ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా న‌టించాడు. రాహుల్ ర‌వీంద్ర‌న్ సినిమాను డైరెక్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మించారు. న‌వంబ‌ర్ 7న తెలుగు, హిందీ భాష‌ల్లో.. న‌వంబ‌ర్ 14న క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లో మూవీ రిలీజ్ కానుంది. రష్మిక నటించిన తొలి ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ ఇది. ఈ సినిమా హిట్ అయితే ఆమె క్రేజ్ మరింత పెరుగుతోంది. అలాగే 2025లో రష్మిక నటించిన ఐదో సినిమా రిలీజ్ అవుతుండటం విశేషం.

Also Read – Rashmika Mandanna: మగవాళ్లకి ఒకసారైనా పీరియడ్స్ బాధేంటో తెలియాలి.. రష్మిక కామెంట్స్ వైరల్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad