Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAM Ratnam: ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత

AM Ratnam: ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించిన ‘హరిహర వీరమల్లు’ నిర్మాత

ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఏ విషయమైనా సరే వ్యక్తిగతంగా చర్చలు ఉండవని.. సినిమా సంఘాల ప్రతినిధుల ద్వారానే ఉంటాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌ సూచన మేరకు ఆయన నటించిన ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ను ఆశ్రయించారు. త్వరలో విడుదల కానున్న తమ చిత్రానికి టికెట్‌ రేట్ల పెంపు, అదనపు షోలకు అనుమతి వంటి అంశాలపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించమని కోరుతూ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌కు ఒక లేఖను సమర్పించారు.

- Advertisement -

కాగా పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో పవన్‌ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. పలు కారణాలతో కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయింది. రిష్‌, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ్‌ ఖేర్, సత్యరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad