Pawan Kalyan Movies: మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా కోసం పవన్ అభిమానులే కాదు, యావత్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా దాదాపు 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తోంది. 2001 లో పవన్ కళ్యాణ్ హీరోగా సూర్య ఎస్ జె దర్శకత్వంలో ఖుషి సినిమాను నిర్మించారు ఏ ఎం రత్నం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
ఆ తర్వాత ఇదే కాంబినేషన్‌లో సత్యాగ్రహీ అనే క్రేజీ టైటిల్‌తో సినిమాను ప్లాన్ చేశారు. ఘనంగా పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. కానీ, సెట్స్ మీదకి రాకుండానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి నుంచి మరో సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయాలని ఏ ఎం రత్నం కల. అది హరి హర వీరమల్లు సినిమా రూపంలో తీరబోతుంది. సత్యాగ్రహి ఆగిపోతేనేమీ వీరమల్లు రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు.
Also Read – Sridevi Vijaykumar: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీదేవి విజయ్ కుమార్, లేటెస్ట్ పిక్స్ వైరల్
2020 లో క్రిష్ దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో హరి హర వీరమల్లు మొదలైంది. అన్నీ అనుకున్నట్టు గనక పూర్తైతే రెండేళ్ళలో సినిమా వచ్చేసేదే. కానీ, కరోనా వేవ్స్.. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ కావడంతో దాదాపు 5 ఏళ్ళు పట్టింది. ఈ సినిమాను రత్నం 120 నుంచి 150 కోట్ల మధ్యలో నిర్మించాలనుకున్నారు. కరోనా, ప్రాజెక్ట్ ఆలస్యం అవడం వల్ల మధ్యలోనే వదిలేయకుండా ఎన్ని అవాంతరాలు ఎదురైనా తట్టుకొని ముందు అనుకున్న బడ్జెట్ కి డబుల్ అయినా భరించారు.
ఇప్పుడు వేసుకుంటున్న లెక్కల ప్రకారం వీరమల్లు బడ్జెట్ దాదాపు 300 కోట్ల వరకూ అయిందని తెలుస్తోంది. అంటే 150 కోట్ల వరకు ఏ ఎం రత్నం కేవలం పవన్ కళ్యాణ్ ని నమ్మి ఆయన మీద అభిమానంతోనే పెట్టారు. ఇంత పెద్ద రిస్క్ మరో నిర్మాత చేయరు. అయితే, ఇప్పుడు సినిమాపై పెరిగిన హైప్.. బజ్ చూస్తుంటే ఖచ్చితంగా పార్ట్ 1 కే రత్నం మంచి లాభాలను చూస్తారని ఇండస్ట్రీలో ప్రముఖులు చెప్పుకుంటున్నారు. కాగా, క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్. ఈ నెల 24న 5 భాషలలో పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతోంది.
Also Read – Aamir Khan Next Movie: మేఘాలయా హత్య కేసుతో సినిమా.. రంగంలోకి ఆమిర్ ఖాన్


