Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభBandla Ganesh: దిల్ రాజు ప్రెస్‌మీట్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

Bandla Ganesh: దిల్ రాజు ప్రెస్‌మీట్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిల్మ్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సినిమాలు ఆపే దమ్ము ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మరో ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

“ఆస్కార్ నటులు, కమలహాసన్లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం” అంటూ బండ్ల పోస్ట్ చేశారు. ఆయన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే దానిపై స్పష్టతలేదు. అయితే దిల్ రాజు ప్రెస్ మీట్ సమయంలోనే ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో బండ్ల వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించే కావొచ్చని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad