Bunny Vasu: బన్నీ వాస్ బీవీ వర్క్స్ బ్యానర్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్‌పై కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. అక్టోబర్ 16న మూవీ రిలీజ్ అవుతుంది. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాసు ఎమోషనల్ అయ్యారు. కొందరు డబ్బులిచ్చి తన సినిమాపై నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తానెందుకు ఎమోషనల్ అయ్యాననే దానిపై బన్నీ వాసు క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చే ముందే నెగటివ్ ట్రోలింగ్ గురించి చెప్పారు. నాకు చాలా బాధేసింది. ఎందుకంటే పది రాత్రులు మా టీమ్‌లో ఎవరికీ నిద్ర లేదు. డైరెక్టర్ అయితే మార్నింగ్ వరకు నిద్ర పోలేదు. డైరెక్టర్ క్లోజ్ ఫ్రెండ్.. మాతో పాటు 9 రాత్రిళ్లు వర్క్ చేసిన వ్యక్తి పని చేస్తుంటే అలాగే పడిపోయాడు. వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేశాం. నిన్న రాత్రి ఆయన చనిపోయాడు. ఇలాంటి ఘటనలు జరిగిన ఎమోషన్స్‌తో మాట్లాడాను. ఇక్కడ నెగటివ్ ట్రోలింగ్ ఏం జరుగుతుంది.. ఎలా జరుగుతుందనేది అందరికీ తెలుసు. కాకపోతే మనం ఎవరం మాట్లాడటం లేదంతే.
Also Read – Bigg Boss Divvala: దువ్వాడ నువ్వు దేవుడివయ్యా.. ఆమెను ఎలా భరిస్తున్నావురా సామి..!
ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్ వల్ల బాధపడిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. హీరోలు కూడా ఉన్నారు. అందరూ ఫేస్ చేసి వదిలేస్తున్నారు. నాకు కూడా చాలా తక్కువ జరిగిందని నేను అనుకుంటున్నాను. తండేల్ సమయంలో నాకు జరిగిందన్నారు. కానీ పట్టించుకోలేదు. కానీ మొన్న జరిగిన నెగటివిటీ తర్వాత రెస్పాండ్ అయ్యాను. చాలా మంది నాకు కాల్ చేశారు. ఎవరో ఒకరు సమస్య గురించి మాట్లాడారని కొందరు ఫోన్ చేసి మాట్లాడారు.
నేను గమనించిన దాన్ని బట్టి డిజిటల్ ఎఫెక్ట్ అనేది విలేజెస్ కంటే సిటీస్‌లోనే ఎక్కువ. నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొంత మంది ఇలాంటి కాంపీటీషన్స్ ఉన్నప్పుడు నిర్మాతలను అప్రోచ్ అవుతున్నారు. కొందరు ప్రొడ్యూసర్స్ అయితే వాళ్లని తిడుతున్నారు. కొందరైతే బెనిఫిట్ అవుతుందని ఎంకరేజ్ చేస్తున్నారు. కొందరు థర్డ్ పార్టీ వ్యక్తులు మా దగ్గర ఇన్ని ఐడీస్ ఉన్నాయని చెబుతున్నారు. వాళ్లు పాజిటివ్ సైడ్ చేస్తున్నారు. అలాగే నెగటివ్ సైడ్ కూడా చేస్తున్నారు.
ఒక సినిమాను తొక్కితే మరో సినిమా లేస్తుందనుకుంటే అంత కంటే పిచ్చోళ్లు ఎవరూ ఉండరు. సినిమాలు బావుంటే రెండూ ఆడుతాయి. అవతలి వాడిని తొక్కి మరో సినిమాను లేపుదామనుకుంటే తప్పనేది నా ఓపినియన్.. అదే నేను చెప్పాను’’ అన్నారు.
Also Read – Simbu: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో – షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌తో డెబ్యూ మూవీ


