Producers Meeting with Chiranjeevi: టాలీవుడ్‌లో సినీ కార్మికుల వేతన పెంపు గురించి కొన్ని రోజులుగా చర్చలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్‌ల మధ్య సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, ప్రముఖ నటుడు చిరంజీవి ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు ముందుకొచ్చారు. మంగళవారం ఆయన నివాసంలో పలువురు నిర్మాతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అల్లు అరవింద్, సురేశ్‌బాబు, కె.ఎల్. నారాయణ, రవిశంకర్, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశ వివరాలను నిర్మాత సి. కల్యాణ్ మీడియాతో పంచుకున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/ntr-on-esquire-photo-made-key-comments-on-family-cinema-legacy/
మూడు రోజులు వెయిట్ చేద్దాం..
ఈ సందర్భంగా సి. కల్యాణ్ మరింత మాట్లాడుతూయయ “మేము చిరంజీవి గారిని కలిసి మా సమస్యలను వివరించాము. చిరంజీవి .. నిర్మాతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. షూటింగ్‌లు ఆగిపోవడం చిత్ర పరిశ్రమకు హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో యూనియన్ నాయకుల వాదనలను కూడా వినాలన్నారు. రాబోయే మూడు రోజుల్లో ఇరు వర్గాలు కలిసి సామరస్యంగా చర్చలు జరపాలని సూచించారు. ఒకవేళ ఈ సమస్య అప్పటికీ పరిష్కారం కాకపోతే, తాను స్వయంగా జోక్యం చేసుకుని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు,” అని సి. కల్యాణ్ వివరించారు.
Alsor Read: https://teluguprabha.net/cinema-news/tamannaah-bhatia-about-item-songs/
చిరంజీవి, పవన్ కు వాళ్లందరూ కావాలి..
దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ సమస్యపై స్పందించారు. “చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, కార్మికులు.. ఇద్దరూ ఎంతో ముఖ్యమైన వారు. నిర్మాత లేకుండా సినిమా తీయడం సాధ్యం కాదు. అలాగే కార్మికులు లేకుండా సినిమా పూర్తి కాదు. చిరంజీవి, పవన్ కల్యాణ్ కు అందరూ కావాలి. వేతనాలపై వివాదాలు ఈ పరిశ్రమలో కొత్తేమీ కాదు, అవి తాత్కాలికంగా ఉంటాయి. కొద్ది రోజుల్లో ఈ గందరగోళం సద్దుమణిగి, అంతా సాధారణ స్థితికి వస్తుంది. అయితే, చిత్ర పరిశ్రమకు స్కిల్ డెవలప్‌మెంట్ చాలా ముఖ్యం. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగితే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.


