Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభYogi Babu : ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో.. కమెడియన్ పై ఫిర్యాదు చేసిన నిర్మాత..

Yogi Babu : ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో.. కమెడియన్ పై ఫిర్యాదు చేసిన నిర్మాత..

- Advertisement -

Yogi Babu : ప్రొడ్యూసర్ కౌన్సిల్‌లో.. ఆ కమెడియన్ పై ఫిర్యాదు చేసిన నిర్మాత..జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి, చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన కామెడీతో అందర్నీ నవ్వించి తమిళ పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు యోగిబాబు. ప్రస్తుతం తమిళ్ లో టాప్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు యోగిబాబు. యోగిబాబు మెయిన్ లీడ్ లో కామెడీ సినిమాలు కూడా తెరకెక్కిస్తున్నారు. తాజాగా తమిళ్ లో దర్శకుడు, నిర్మాత గిన్నిస్ కిషోర్.. యోగిబాబుని మెయిన్ లీడ్ లో పెట్టి దాదా అనే ఓ కామెడీ సినిమాని తీశారు.

యోగిబాబు మెయిన్ లీడ్ లో నటించిన దాదా సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.
తాజాగా చెన్నైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే ఈ ఈవెంట్ కి యోగిబాబు హాజరవ్వలేదు. ఈ ఈవెంట్లో సినిమా నిర్మాత, దర్శకుడు గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ యోగిబాబుపై సంచలన ఆరోపణలు చేశారు.

గిన్నిస్ కిషోర్ మాట్లాడుతూ.. ”యోగిబాబు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ సమయంలో కూడా బయ్యర్లకి ఫోన్ చేసి ఈ సినిమాలో నేను నాలుగు సీన్స్ లోనే నటించాను, సినిమా కొనకండి అని చెప్తున్నాడు. నా బిజినెస్ ని దెబ్బ తీస్తున్నాడు. సినిమా చూడండి అప్పుడు ఎన్ని సీన్స్ లో నటించాడో మీకే తెలుస్తుంది. డబ్బింగ్ చెప్పడానికి కూడా చాలా ఇబ్బందులు కలిగించాడు. చాలా సార్లు అతని చుట్టూ తిప్పించుకున్నాడు. అతనితో ఇంకో సినిమా చేయడానికి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడేమో సినిమా చేయను అంటున్నాడు. అందుకే యోగిబాబుపై తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాను. నా సినిమాలో నటించకపోతే వేరే సినిమాల్లో కూడా నటించకుండా చర్యలు తీసుకోవాలని కోరాను” అని తెలిపారు. దీంతో ఆ నిర్మాత చేసిన వ్యాఖ్యలు తమిళ పరిశ్రమలో చర్చగా మారాయి. దీనిపై యోగిబాబు మాత్రం ఇంకా స్పందించలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News