Fish Venkat: తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఫిష్ వెంకట్ ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్ కావటం, సకాలంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కి దాతలు లేకపోవటం, సరైన ఆర్థిక సాయం అందకపోవటంతో ఫిష్ వెంకట్ కన్నుమూశారు. వెంకట్ చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి సినీ ప్రముఖులెవరు రాలేదు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. ఫిష్ వెంకట్‌ను ఇండస్ట్రీ పట్టించుకోలేదని కామెంట్స్ వచ్చాయి.
ఈ క్రమంలో.. విమర్శలపై నిర్మాత నట్టి కుమార్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ‘షిఫ్ వెంకట్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఫిల్మ్ నగర్, మణికొండ ప్రాంతాలకు దూరంగా ఉంటే ప్రముఖులు సాధారణంగా వెళ్లరు. దానికి కారణం కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లొకేషన్ ఇబ్బందులు కావచ్చు అందుకనే సెలబ్రిటీలు దూరంగా ఉంటే వెళ్లటానికి ఆలోచిస్తారు. షిఫ్ వెంకట్‌కి ఓ మేనేజర్ ఉండేవాడు. మూడు వేల నుంచి రోజుకి ముప్పై ఐదు వేల రెమ్యునరేషన్ స్థాయికి ఎదిగారు. ఇదొక బిజీ ప్రపంచం. సినీ ఇండస్ట్రీలో రిలేషన్ షిప్ మెయిన్‌టెయిన్ చేయరు. కొన్ని గ్రూప్స్ ఉంటాయి. అందులోఉండేవాళ్లకైతే త్వరగా తెలుస్తుంది. ఉదాహరణకు ఫిష్ వెంకట్‌కి గబ్బర్ సింగ్ బ్యాచ్‌తో రిలేషన్ ఉంది. అందుకనే ఆయన చనిపోతే వాళ్లు వచ్చారు.
Also Read – PM Modi: పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ సంబరాలు
సినిమాల్లో నటించాడు కదా.. ఎవరూ రాలేదేంటి? అనే భావన అందరికీ ఉండొచ్చు. కానీ షిఫ్ వెంకట్ అసోసియేషన్ మెంబర్ కాదు. ఇండస్ట్రీలో ఎవరి బిజీ వారిది. ఎవరిష్టం వారిది. పెద్ద డైెరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చనిపోతే వచ్చిన సినిమా వాళ్లు తర్వాత వాళ్ల పిల్లలను గుర్తించరు. ఫలానా వాళ్లు మనతో కలిసి వర్క్ చేశారు కదా, వాళ్లేమైనా చేస్తారనుకుంటే పొరపాటే. అది నేనైనా కూడా కావచ్చు. రాజకీయాలైనా కావచ్చు, సినీ ఇండస్ట్రీ అయినా కావచ్చు.. ఇక అవసరమే మాట్లాడిస్తుంది. ఏదైనా మనం డిమాండ్ చేయకూడదు. ఈ సినీ ప్రపంచంలో ఇన్‌ఫర్మేషన్ ఎంతో అవసరం. అది లేనప్పుడు ఎవరినీ ఏమీ అనలేం.
సినీ ఇండస్ట్రీకి మానవత్వం లేదు, సినిమాలను బ్యాన్ చేయాలంటూ కొందరు చేసిన కామెంట్స్ గురించి పట్టించుకోనవసరం లేదు. ఈరోజు కామెంట్స్ చేసిన వాళ్లే రేపు సినిమాకు వెళతారు. మన తర్వాత మన జనరేషన్ సినీ ఇండస్ట్రీలో ఉంటేనే గుర్తుపడతారు. అది లేనివాళ్లైనా, ఉన్న వాళ్లైనా అంతే. అసోసియేషన్ తరపున ఏదైనా హెల్ప్ కావాలంటే జరుగుతుంది కానీ.. అవతల వాడికి ఏదైనా చేస్తారని ఆశించవద్దు.
Also Read – Student Ends Life at University: యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్య


