Raviteja: రవితేజ హీరోగా నటించిన మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ నిలిచింది. రైటర్ భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమైన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. రిలీజ్‌కు ముందు మాస్ జాతరపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
డిజాస్టర్ టాక్‌తోనూ థియేటర్లలో మాస్ జాతర మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇరవై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు పదకొండు కోట్ల వరకు వసూళ్లను దక్కించుకుంది. రిలీజై ఎనిమిది రోజులు అయినా ఇప్పటికీ మోస్తారు వసూళ్లతో థియేటర్లలో రన్ అవుతోంది. శని, ఆదివారం.. రెండు రోజుల్లో కలిపి కోటి వరకు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ది గర్ల్‌ఫ్రెండ్‌తో పాటు ఈ వారం రిలీజైన ఐదు సినిమాల పోటీని తట్టుకొని మాస్ జాతర నిలబడుతోంది.
సరైన ప్రమోషన్స్ చేసి ఉంటే మాస్ జాతర హిట్టయ్యేదని రవితేజ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. రిలీజ్ తర్వాత థాంక్స్ మీట్, సక్సెస్ మీట్ లాంటివేవి నిర్వహించలేదు. కలెక్షన్స్, టాక్‌కు సంబంధించి ఎలాంటి ట్వీట్స్, పోస్ట్‌లు నిర్మాణ సంస్థ పెట్టలేదు. ఈ విషయంలో నిర్మాత నాగవంశీని రవితేజ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. నిర్మాతలు సరైన ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ సినిమా ఫెయిలైందని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read – Heroine Imanvi: కడుపుతో పాటు మనసు నిండిపోయింది.. ప్రభాస్ పై ఇమాన్వీ కామెంట్స్..
నిర్మాతల వాదన మాత్రం మరోలా ఉందట. ప్రమోషన్స్ విషయంలో రవితేజనే నిర్మాతలకు సరిగ్గా కో ఆపరేట్ చేయడం లేదని ప్రచారం జరుగుతోంది. రిలీజ్‌కు ముందు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాత్రమే రవితేజ పాల్గొన్నారు. కొన్ని కామన్ ఇంటర్వ్యూలు ఇచ్చారు. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్, థాంక్స్ మీట్‌తో పాటు మరికొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేశారట మేకర్స్. వాటికి రవితేజను తీసుకురావాలని అనుకున్నారట.
కానీ రవితేజ మాత్రం మాస్ జాతర రిలీజైన నెక్స్ట్ డేనే కిషోర్ తిరుమల షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. మాస్ జాతరను అస్సలు పట్టించుకోలేదని నిర్మాతలు వాపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయ. రవితేజ ప్రమోషన్స్ లో పాల్గొని ఉంటే కనీసం ఇంకో ఐదు కోట్ల వరకు అయినా కలెక్షన్స్ వచ్చేవని, నష్టాలు చాలా వరకు తగ్గేవని వారు చెబుతోన్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. హీరోనే ఓకే అనకపోతే తాము ఎవరితో ప్రమోషన్స్ చేస్తామని నిర్మాతలు చెబుతున్నారట.
మాస్ జాతర రిలీజ్ డేట్‌ను రెండు, మూడు సార్లు మార్చడం వల్లే రవితేజకు, నాగవంశీకి మధ్య చెడిందని సమాచారం. వినాయకచవితి కానుకగా ఆగస్ట్ 27న ఈ సినిమాను ఎలాగైనా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రవితేజ గట్టిగా ఫిక్సయ్యారు. వార్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్‌తో నాగవంశీ ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేశారు. అక్కడి నుంచే రవితేజ మాస్ జాతరను పట్టించుకోవడం మానేశాడని సమాచారం. మొక్కుబడిగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడని అంటున్నారు. ఈ సైలెంట్ గొడవల మధ్య మాస్ జాతర నలిగిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
Also Read – Mohanlal: ఆపరేషన్ సింధూర్ బ్యాక్‌డ్రాప్‌లో మోహన్‌లాల్ మూవీ – బాయ్ కాట్ చేస్తామంటున్న నెటిజన్లు


