Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభProject K: ప్రాజెక్ట్ K స్టోరీ ఇదేనట

Project K: ప్రాజెక్ట్ K స్టోరీ ఇదేనట

సై-ఫై ఫ్యాంటసీ మూవీగా రెడీ అవుతోంది ప్రాజెక్ట్ K. ప్రభాస్, దీపికా పదుకున్, అమితాబ్ బచ్చన్ వంటి సూపర్ స్టార్స్ తో నిండిన ఈ ప్యాన్ ఇండియా మూవీని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ సినిమాలను చెక్కే తీరుపై తెలుగు ప్రేక్షకులకు చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వనుంది. అశ్వినీ దత్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో గట్టిగా వినిపిస్తోంది.

- Advertisement -

విష్ణు మూర్తి మోడరన్ డేస్ లో ఎలా ఉంటారనేది ఊహించి తెరకెక్కిస్తుండటం ఇందులోని ప్రధాన ఇతి వృత్తంగా తెలుస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కొత్త ట్విస్టులతో ఈ సినిమా ఆద్యంతం సాగేలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ప్రాజెక్ట్ K తెరకెక్కుతున్న సమాచారం. ఇక ఇది హెవీ గ్రాఫిక్స్ ఉన్న సినిమా అన్నదాంట్లో మీకు ఏ సందేహం అక్కర్లేదు. ఇప్పటికే 70 శాతం సినిమా చుట్టేశారు. హై సెంటిమెంట్ ఉన్న సినిమాగా రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్ట్ K కోసం నలుగురైదుగురు ఇంటర్నేషనల్ స్టంట్ కొరియోగ్రఫర్స్ ను హైర్ చేయటం మరో హైలైట్. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉండేలా గొప్ప అనుభూతి ఇచ్చేలా ఈ సినిమా ముస్తాబవుతోంది. ఈ సినిమాలో మన డార్లింగ్ ప్రభాస్ ను సరికొత్తగా చూపుతున్నారు. సినిమాకు ఇప్పటికే చాలా మంచి క్రేజ్ వచ్చింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News