Saturday, November 15, 2025
HomeTop StoriesPuri Jagannadh Charmme Relation : పూరీ క్లారిటీ ఇచ్చేశారు.. ఛార్మీతో నా రిలేషన్ ఇదే!

Puri Jagannadh Charmme Relation : పూరీ క్లారిటీ ఇచ్చేశారు.. ఛార్మీతో నా రిలేషన్ ఇదే!

Puri Jagannadh Charmme Relation : టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నటి-నిర్మాత చార్మీ కౌర్ మధ్య రొమాన్స్ పుకార్లు సోషల్ మీడియాలో ఎప్పటికీ హాట్ టాపిక్. తాజాగా జగపతి బాబు హోస్ట్‌గా నిర్వహించే టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్మురా’లో పూరీ తనదైన శైలిలో ముగింపు పలికారు. “మా మధ్య స్నేహం మాత్రమే. రొమాంటిక్ రిలేషన్ లేదు” అని స్పష్టం చేశారు. 20 సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నామని, ఛార్మీ 13 ఏళ్ల వయసు నుంచే తెలుసు అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పుకార్లకు చెక్ పెట్టాయి.

- Advertisement -

ALSO READ: Rao Bala Saraswathi: తొలి నేపథ్య గాయని బాలసరస్వతి కన్నుమూత

పూరీ మాట్లాడుతూ, “సోషల్ మీడియా యువత కారణంగా ఇలాంటి రూమర్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఛార్మీ సింగిల్‌గా ఉండటమే ప్రధాన కారణం. ఒకవేళ ఆమె 50 ఏళ్లు ఉండి, పెళ్లి అయి ఉంటే ఎవరూ పట్టించుకోరు” అని వ్యాఖ్యానించారు. తమ మధ్య శాశ్వత స్నేహం మాత్రమేనని, కలిసి ఎన్నో సినిమాలు చేశామని గుర్తు చేశారు. ‘రాజధాని’లో చార్మీ హీరోయిన్, ‘తుఫాన్’లో స్పెషల్ రోల్ చేసింది. పూరీ డైరెక్షన్‌లో చార్మీ నిర్మాణంలో కూడా పాల్గొన్నారు. 2010లో మొదలైన ఈ పుకార్లు, ఇప్పుడు ముగిసిపోయాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad