Friday, November 22, 2024
Homeచిత్ర ప్రభPuri Jagannadh: వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్.. జాగ్రత్తగా ఉండండి: పూరి జగన్నాథ్

Puri Jagannadh: వాళ్ళు క్రిమినల్స్ కంటే డేంజర్.. జాగ్రత్తగా ఉండండి: పూరి జగన్నాథ్

Puri Jagannadh|బ్లాక్‌మెయిల్‌ కంటే ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ ఎంతో ప్రమాదకరమైందని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెలిపారు. మన కుటుంబసభ్యులే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడంలో ముందుంటారని పేర్కొన్నారు. తాజాగా తన ‘పూరి మ్యూజింగ్స్’ వీడియోలో ఎమోషన్ బ్లాక్‌మెయిల్ గురించి మాట్లాడారు.

- Advertisement -

ఈ వీడియో ఆయన మాటలు యధావిథిగా..

‘‘బ్లాక్‌మెయిల్‌ కంటే ప్రమాదకరమైనది ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌. ముక్కు, ముఖం తెలియని వ్యక్తులు బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. కానీ, నీ ఇంట్లో వాళ్లు, నువ్వు బాగా ప్రేమించేవాళ్లు, గౌరవించేవాళ్లు వాళ్లే నిన్ను ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తారు. అమ్మ, నాన్న, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు ఎక్కువగా దీనికి పాల్పడుతుంటారు. నీకోసం ఇంత చేశాం. మాకోసం నువ్వు ఇది చేయలేవా? అంటూ చదువు, పెళ్లి, పిల్లలు వంటి విషయాల్లో ఒత్తిడి చేస్తుంటారు. మనల్ని కంట్రోల్‌ చేయడం కోసం ప్రేమ చూపించి ఒకరకమైన గిల్ట్‌ క్రియేట్‌ చేస్తారు. వాళ్లు అనుకున్నది జరగాలి? అంతేతప్ప నీ ఇష్టం ఏంటి అనేది ఎప్పుడూ అడగరు. వాళ్ల ఇష్టం ప్రకారం మీరు పెళ్లి చేసుకుంటారు.. పిల్లలను కంటారు. వాళ్లదేంపోయింది. పిల్లలను జీవితాంతం పెంచాల్సింది మీరు. ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేసేవారు అలుగుతారు. ఏడుస్తారు. మీతో మాట్లాడటం మానేస్తారు ఇలా చాలా డ్రామాలు చేస్తారు. ఇలాంటి వాటి వల్ల మీరు నిద్రలేని రాత్రులు గడుపుతారు. కంగారుకు గురవుతారు. కుంగుబాటుకు లోనవుతారు. ఇంట్లో సమస్యలు కదా అని ఎవరితోనూ పంచుకోలేరు. మీలో మీరే మథనపడుతూ బతుకుతారు. గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో వాళ్లు అమాయకంగా కనిపించే క్రిమినల్స్‌. ఎవరి స్వార్థం వారిదే. వారితో చాలా జాగ్రత్తగా ఉండండి.

స్వార్థం కోసం వాళ్లు ఏవేవో అడుగుతుంటారు. వింటే నీకు సరదా తీరిపోతుంది. ఎవరైనా ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తే వారిని పక్కన పెట్టేయండి. మిగిలిన అన్ని విషయాలు వినండి. మీరు ఇబ్బందిపడే పనులు అస్సలు చేయొద్దు. వాళ్లు డ్రామాలు చేస్తే అంతకంటే ఎక్కువ మీరు చేయండి. ఇల్లు వదిలి వెళ్లిపోండి. రెండు రోజులు రాకండి. వాళ్లు అలాంటి డైలాగ్స్‌ వాడితే మీరూ అవే వాడండి. నెల రోజుల తర్వాత మిమ్మల్ని అడిగే విషయాల కోసం ఇప్పటి నుంచే ప్రేమ చూపిస్తుంటారు. మీరు అలర్ట్‌గా ఉంటే ఈ లక్షణాలు గుర్తించగలుగుతారు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, మామ, పిన్ని లేదా జీవిత భాగస్వామి ఎవరైనా కావచ్చు.. బ్లాక్‌మెయిలర్స్‌కు మాత్రం విలువ ఇవ్వకండి. ఎవరైతే ఇంట్లో బాధ్యతలు తీసుకుంటారో, కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారే వాళ్లపై ఇలాంటి దాడులు జరుగుతుంటాయి. ఆస్తి బంగారం, కోడలు, పిల్లలు, డాక్యుమెంట్లపై పేర్లు మార్చడం కోసం రకరకాల డ్రామాలు ఆడతారు. అస్సలు పట్టించుకోవద్దు. ఇంట్లో వాళ్లని బాగా చూసుకోండి. బ్లాక్‌మెయిల్స్‌ని సీరియస్‌గా తీసుకోవద్దు’’ అంటూ సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News