Puri Jagannadh Telugu Movies: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా, బాలీవుడ్‌లోనూ క్రేజ్ ఉన్న దర్శకుడు పూరి జగన్నాధ్. మొదటి సినిమానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసే గొప్ప అవకాశాన్ని అందుకున్న పూరి, ఈ మూవీతో ఆయనకి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌లతో తప్ప.. మిగతా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసి హిట్ ఇచ్చారు. అంతేకాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలకి ఫ్యాన్ బేస్ ఎక్కువ. అందుకు తగ్గటే పూరి జగన్నాధ్ ఏ హీరోతో సినిమా చేసినా ఫ్యాన్స్‌ని దృష్టిలో పెట్టుకొని.. ఆ హీరోకి మాస్ ఇమేజ్ వచ్చేలా హిట్ ఇచ్చారు. ఇక మెగాస్టార్ తనయుడు ఇప్పటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేసిన క్రెడిట్ జగన్‌దే కావడం విశేషం.
రవితేజతో ఎక్కువ సినిమాలు చేశారు పూరి జగన్నాధ్. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అలాగే, నాగార్జునతో రెండు సినిమాలు.. పవన్ కళ్యాణ్‌తో రెండు సినిమాలు, మహేశ్ బాబుతో రెండు సినిమాలు, ఎన్టీఆర్ తో రెండు సినిమాలు, రామ్ పోతినేనితో రెండు సినిమాలు, తమ్ముడు సాయి రామ్ శంకర్‌తో ఒక సినిమా, కొడుకు ఆకాష్ పూరితో ఒక సినిమా, నందమూరి కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా, బాలయ్యతో ఒక సినిమా, జగపతి బాబుతో ఒక సినిమా, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్‌తో ఒక సినిమా, హిందీలో బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో ఒక సినిమా, విజయ్ దేవరకొండతో ఒక సినిమా, గోపీచంద్ హీరోగా ఒక సినిమా, రానా దగ్గుబాటితో ఒక సినిమాను, వరుణ్ తేజ్‌తో ఒక సినిమా.. ఇంకా కొత్త హీరోలను పరిచయం చేస్తూ కొన్ని సినిమాలు చేశారు.
Also Read – Walnut: రోజుకు ఎన్ని వాల్ నట్స్‌ను తినాలి..?
పూరి జగన్నాధ్ ఒక దర్శకుడిగా సంపాదించినంత పేరు, డబ్బు ఒకదశలో మరే దర్శకుడు సంపాదించలేదంటే నమ్మి తీరాల్సిందే. అయితే, ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎన్ని హిట్స్ అందుకున్నారో, అన్ని ఫ్లాప్స్ ని చూశారు. కానీ, హీరోలకి మాత్రం విపరీతమైన మార్కెట్‌ని తెచ్చిపెట్టారు. పూరికి అభిమానులు కేవలం ప్రేక్షకులే కాదు.. వి.వి. వినాయక్, సుకుమార్, రాజమౌళి లాంటి దర్శకులూ ఉన్నారు. ఇక అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవి, ఆర్జీవీ లాంటి వారికి ఈయన మేకింగ్ స్టైల్, సినిమాను జెట్ స్పీడ్‌లో కంప్లీట్ చేసే పక్కా ప్లానింగ్ బాగా నచ్చుతుంది.
అయితే ప్రస్తుతం పూరి జగన్నాధ్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో ఓ సినిమాను చేస్తుండగా..‘బెగ్గర్’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, టబు, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. నిజంగా డిసెంబర్ లో పూరి, సేతుపతిల సినిమా వస్తే మేకర్స్ పెద్ద రిస్క్ చేయబోతున్నట్టే అని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. ఇదే డిసెంబర్‌లో ప్రభాస్ ‘రాజాసాబ్’, హాలీవుడ్ చిత్రం ‘అవతార్ 3’, బాలయ్య ‘అఖండ 2’ ఉన్నాయి. ఈ సినిమాల మధ్య పూరి తన సినిమాను దింపితే మాత్రం కలెక్షన్స్ పరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి అధికారికంగా దీనికి సంబందించిన కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో.
Also Read – China: జూలై 24 నుండి ప్రారంభం కానున్న టూరిస్ట్ వీసాల జారీ..!


