పుష్ప -2 (Pushpa 2) ప్రీమియర్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అభిమానులు పోటెత్తారు. థియేటర్ల వద్ద వైల్డ్ జాతర కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. సంధ్య థియేటర్ లో అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల ఉన్న బన్నీ ఫ్యాన్స్ తనని చూసేందుకు ఎగబడ్డారు.
ఈ తరుణంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ఓ బాలుడు స్పృహ కోల్పోయాడు. పోలీసులు బాలుడికి సీపీఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు, ఇదే థియేటర్ లో అల్లు అర్జున్, అతని ఫ్యామిలీ పుష్ప -2 (Pushpa 2) సినిమా చూస్తుండగా, బాలానగర్ విమలా థియేటర్ లో హీరోయిన్ శ్రీలీల సినిమా తిలకిస్తున్నారు. ఇక బన్నీ స్నేహితుడు, వైసీపీ నేత శిల్పా రవి కూడా సంధ్య థియేటర్ లో సినిమా చూసేందుకు ఫ్యామిలీతో సహా వచ్చారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.