Thursday, December 5, 2024
Homeచిత్ర ప్రభPushpa2: హైదరాబాద్‌లో ‘పుష్ప2’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఏర్పాట్లు షురూ

Pushpa2: హైదరాబాద్‌లో ‘పుష్ప2’ గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఏర్పాట్లు షురూ

Pushpa2|ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 The Rule). రష్మిక మందన్నా(Rashmika) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డిసెంబరు 5న ఈ మూవీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్‌ నిర్వహిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. తాజాగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. డిసెంబర్ 2న హైదరబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో దీనిని నిర్వహించనున్నట్లు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది.

- Advertisement -

మరోవైపు తెలంగాణలో టికెట్ ధరలు(Ticket Rates) భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా బెన్‌ఫిట్‌ షోలకు కూడా అనుమతి ఇచ్చింది. దీంతో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కాగా ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో ‘పుష్ప2’ విడుదలకానుంది.

డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రాత్రి 9.30గంటల షోకు టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచింది. ఈ షో చూడాలంటే రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ప్రస్తుతం ఉన్న టికెట్‌ ధరకు అదనంగా రూ.800 చెల్లించాలి. దీంతో సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర సుమారు రూ.1000 అవుతుండగా, మల్టీప్లెక్స్‌లో రూ.1200లకు పైగా ఖర్చు పెట్టాలి.

ఇక డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News