Saturday, December 28, 2024
Homeచిత్ర ప్రభPushpa 2: ఇండియా నంబర్ 1 హీరోగా అల్లు అర్జున్

Pushpa 2: ఇండియా నంబర్ 1 హీరోగా అల్లు అర్జున్

నంబర్ 1 హీరోగా..

21 రోజుల్లో రూ.1705 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి భారతీయ చిత్రం ఇండియన్‌ బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప-2’
ఇండియా మొత్తం పుష్ప-2 రికార్డుల మోత మోగిస్తోంది.

- Advertisement -

ఇండియన్‌ బాక్సాఫీస్‌పై పుష్పరాజ్‌ రూల్‌ కంటిన్యూ అవుతోంది. డిసెంబరు 4న ప్రీమియర్స్‌ షో నుంచే ఇండియన్‌ బాక్సాఫీస్‌పై మొదలైన పుష్పరాజ్ రూల్‌ రోజు రోజుకి అత్యధిక కలెక్షన్లతో కొనసాగుతోంది. ఐకాన్‌ స్టార్‌ నట విశ్వరూపం బ్రిలియంట్‌ అండ్‌ జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ అత్యద్భుతమైన టేకింగ్‌ మెస్మరైజింగ్‌ కథ కథనాలు వెరసి పుష్ప-2 ది రూల్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి, సరికొత్త రికార్డుల మోత.. ఇండియన్‌ సినీ చరిత్రలో పుష్ప-2 సరికొత్త అధ్యాయం క్రియేట్‌ చేస్తోంది.

ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాగా

విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపంకు, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌ ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది. సినిమా తొలి రోజు నుంచే కంటిన్యూగా వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించిన ఈ చిత్రం తాజాగా 21 రోజుల్లో రూ.1705 కోట్ల రూపాయాలు సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ.1700 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

తొలి ఇండియన్ ఫిలింగా
కేవలం 21 రోజుల్లోనే రూ.1705 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ ది రూల్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త అధ్యాయాన్ని క్రియేట్‌ చేసింది. ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న పుష్ప-2 ముఖ్యంగా బాలీవుడ్‌లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లో ఇప్పటి వరకు రూ. 700 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి వందేళ్ల బాలీవుడ్‌ చరిత్రలోనే సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది.
ఒక రికార్డు ప్రకటించే లోపే మరొ కొత్త రికార్డును పుష్ప-2 సాధిస్తుండటం యావత్‌ భారతీయ సినీ పరిశ్రమను సంభ్రమశ్చర్యాలకు గురిచేస్తుంది.

ఇండియాలో నంబర్ 1 హీరోగా

ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా అందరూ కొనియాడుతున్నారు. దర్శకుడు సుకుమార్‌ కూడా భారతదేశం గర్వించదగ్గ దర్శకుడిగా టాప్‌ పొజిషన్‌లో ఉన్నాడు. ఆయన దర్శకత్వ ప్రతిభకు అంతర్జాతీయంగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News