Saturday, October 26, 2024
Homeచిత్ర ప్రభPushpa2: 'పుష్ప2' అదిరిపోయే రికార్డు.. అభిమానుల్లో ఫుల్ జోష్

Pushpa2: ‘పుష్ప2’ అదిరిపోయే రికార్డు.. అభిమానుల్లో ఫుల్ జోష్

Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప2’. స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప మూవీతో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకోవడంతో పుష్ప2 మూవీ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. వాస్తవంగా ఈ ఏడాది డిసెంబర్ 6న మూవీని విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఓరోజు ముందు విడుదల చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందని నిర్మాతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది.

- Advertisement -

ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ వార్తను మేకర్స్ అధికారికంగా‌ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో 11,500 స్క్రీన్స్‌ల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇండియాలో 6,500.. ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా ఈ స్థాయిలో విడుదల కాలేదని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బిగ్గెస్ట్‌ రిలీజ్ ఇండియన్‌ సినిమాగా ‘పుష్ప2’ రికార్డు సృష్టించనుంంది. దీంతో ఈ చిత్రం కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కాగా పుష్ప2 హిట్ అయితే కచ్చితంగా పుష్ప3 ఉంటుందని నిర్మాతలు స్పష్టంచేశారు. పుష్ప2 ఎండింగ్‌లో పుష్ప3 పార్ట్‌కు లీడ్ ఇస్తామన్నారు. ఇక పుష్ప2 మూవీ ప్రమోషన్స్ గట్టిగా చేస్తామన్నారు. అయితే నార్త్ ఇండియాలో ప్రమోషన్స్ ఎక్కువగా చేద్దామని డిసైడ్ అయినట్లు చెప్పుకొచ్చారు. అందుకే ముంబైలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. నవంబర్ నెలలో ట్రైలర్‌తో పాటు 2 లిరికల్ సాంగ్స్ విడుదల చేస్తామన్నారు. ఇక సినిమాలోని జాతర ఎపిసోస్ చిత్రీకరణకు దాదాపు 35 రోజులు పట్టిందని.. దాని కోసం రిహార్సల్స్‌ కూడా చేశారన్నారు. అందరూ ఊహిస్తున్నట్టే ఆ ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందన్నారు.

అలాగే పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ. 1000 కోట్లు క్రాస్‌ అయిందనే వార్తలపై నిర్మాతలు మాట్లాడుతూ థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నారని క్లారిటీ ఇచ్చారు. అయితే నాన్‌ థియేట్రికల్‌ విషయంలో ఇప్పటి వరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని పేర్కొన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుండగా.. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News