Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘పుష్ప2’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ సినిమా అంటే ఐటం సాంగ్‌లకు పెట్టింది పేరు. ఈ సినిమాలో కూడా అదిరిపోయే ఐటం సాంగ్ ఉందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించింది. తాజాగా ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. ‘కిస్సిక్’ అంటూ సాంగే ఈ పాటను ఆదివారం సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పాటలో శ్రీలీల, అల్లు అర్జున్ స్టెప్పులు అదిరిపోతాయంటూ చెబుతున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పుష్ప’ మేనియా నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ విడుదలైన నాటి నుంచి ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. కాగా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.