Wednesday, February 5, 2025
Homeచిత్ర ప్రభPushpa 2: ఓటీటీలోనూ ‘పుష్ప 2’ తగ్గేదేలే

Pushpa 2: ఓటీటీలోనూ ‘పుష్ప 2’ తగ్గేదేలే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా, దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప 2’(Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మూవీ ఇప్పటివరకు రూ.1850కోట్లకు పైగా కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్‌ నటన, సుకుమార్‌ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగు సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది.

- Advertisement -

జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌(Netflix) వేదికగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లోనూ రికార్డు సృష్టించింది. వ్యూస్‌ పరంగా ఏడు దేశాల్లో నంబర్‌ వన్‌ స్థానాన్ని కైవసం చేసుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లేతర సినిమాల విభాగంలో 5.8 మిలియన్ల వ్యూస్‌తో నెట్‌ఫ్లిక్స్‌లో రెండో స్థానంలో నిలిచింది. 3 గంటల 40 నిమిషాలు నిడివితో ఓటీటీ వెర్షన్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు దేశాల్లో నెంబర్ వన్‌గా నిలవడంతై తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News