Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభFahadh Faasil: సినిమాలు మానేసి.. ఫ‌హాద్ ఫాజిల్ సంచలన నిర్ణయం

Fahadh Faasil: సినిమాలు మానేసి.. ఫ‌హాద్ ఫాజిల్ సంచలన నిర్ణయం

Fahadh Faasil: మ‌ల‌యాళ సినిమాల‌తో కెరీర్‌ను మొద‌లుపెట్టి పాన్ ఇండియ‌న్ యాక్ట‌ర్‌గా మారాడు ఫ‌హాద్ ఫాజిల్‌. ప్ర‌స్తుతం మాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమాలు చేస్తున్నాడు. హీరోగానే కాకుండా విల‌న్ పాత్ర‌ల్లో న‌టిస్తూ వెర్స‌టైల్ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప, పుష్ప 2 సినిమాల్లో భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ అనే పాత్ర‌లో విల‌న్‌గా భ‌య‌పెడుతూనే న‌వ్వించాడు. పుష్ప సిరీస్‌తో తెలుగులో ఫ‌హాద్ ఫాజిల్‌కు మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

- Advertisement -

బార్సిలోనాలో సెటిల‌వుతా…
త‌న యాక్టింగ్ రిటైర్‌మెంట్ ప్లాన్స్ గురించి ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు ఫ‌హాద్ ఫాజిల్‌. ప్రేక్ష‌కులు నా యాక్టింగ్‌ను బోర్‌గా ఫీల‌యిన రోజు సినిమాల నుంచి త‌ప్పుకుంటా. ఇండ‌స్ట్రీకి దూరంగా వెళ్లిపోతా. స్పెయిన్‌లో బార్సిలోనాలో సెటిల‌య్యి… అక్క‌డే క్యాబ్‌ డ్రైవ‌ర్‌గా ఉద్యోగం చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేయాల‌న్న‌ది నా క‌ల. ఏదో ఒక రోజు నా క‌ల‌ను నిజం చేసుకుంటాన‌నే న‌మ్మ‌క‌ముంది అని అన్నారు.

Also Read – DOST special face: దోస్త్ స్పెషల్ ఫేజ్ ఎంట్రీ.. ఈరోజు నుంచే రిజిస్ట్రేషన్లు..!

న‌జ్రియాకు తెలుసు…
క్యాబ్ డ్రైవ‌ర్ డ్రీమ్ గురించి భార్య న‌జ్రియా న‌జీమ్‌తో ఎప్పుడూ చెబుతుంటాన‌ని తెలిపాడు. ప్ర‌జ‌ల‌ను వారి గ‌మ్య‌స్థానాల‌కు చేర్చ‌డంలో ఉన్న సంతృప్తి ఎందులోనూ త‌న‌కు క‌నిపించ‌లేద‌ని ఫ‌హాద్ ఫాజిల్ అన్నాడు. సినిమాల తాలూకు ఒత్తిడి నుంచి దూరమ‌వ్వ‌డానికి డ్రైవింగ్ త‌న‌కు హెల్ప‌వుతుంటుంద‌ని ఫ‌హాద్ ఫాజిల్ చెప్పాడు. ఖాళీ దొరికితే ఎక్కువ‌గా లాంగ్ డ్రైవ్‌ల‌కు వెళుతుంటాన‌ని చెప్పాడు.

పాజిటివ్ టాక్‌…
ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన త‌మిళ మూవీ మారీస‌న్ శుక్ర‌వారం (నేడు) రిలీజైంది. కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. వ‌డివేలు కీల‌క పాత్ర‌లో నటించిన ఈ సినిమాకు సుధీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తెలుగులో రెండు సినిమాలు…
పుష్ప 2 త‌ర్వాత తెలుగులో డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్‌తో పాటు ఆక్సిజ‌న్ అనే సినిమాలు చేస్తున్నాడు ఫ‌హాద్ ఫాజిల్‌. ఈ సినిమాల‌ను బాహుబ‌లి నిర్మాత‌ల‌తో క‌లిసి రాజ‌మౌళి త‌న‌యుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళంలో ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా న‌టిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

Also Read – Shukra Gochar 2025: శ్రావణంలో శుక్రుడి సంచారం.. ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad