Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRaashi khanna: పవన్ సినిమాతో రీ ఎంట్రీ

Raashi khanna: పవన్ సినిమాతో రీ ఎంట్రీ

Raashi khanna: ‘మద్రాస్ కేఫ్’ సినిమాతో బాలీవుడ్‌లో.. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌‌లో ఎంట్రీ ఇచ్చింది బబ్లీ బ్యూటీ రాశీఖన్నా. ఈ రెండు సినిమాలు రాశికి మంచి హిట్స్ ని ఇచ్చాయి. దాంతో అతి తక్కువ సమయంలోనే తెలుగులో యంగ్ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారింది. అక్కినేని నాగ చైతన్య, గోపీచంద్‌, సందీప్ కిషన్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్ తేజ్ లాంటి కుర్ర హీరోలతో రొమాన్స్ చేసింది. అంతేకాదు, ఎన్టీఆర్‌, రవితేజ వంటి స్టార్స్ తోనూ రాశీఖన్నా సినిమాలు చేసి హిట్స్ అందుకుంది. ఎన్టీఆర్‌ నటించిన జై లవకుశ మూవీ రాశి ఖన్నా కెరీర్‌కి బాగానే ఉపయోగపడింది.

- Advertisement -

ఆ తర్వాత నుంచి మళ్ళీ అంత పెద్ద స్టార్ హీరోల సినిమాలలో కనిపించలేదు. తెలుగుతో పాటు తమిళంలో, హిందీలో కూడా రాశికి మంచి క్రేజ్ ఉంది. టాలీవుడ్‌లో కొద్దిపాటి గ్యాప్‌ తర్వాత ఈ బ్యూటీ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. తెలుగులో రాశి చివరగా అక్కినేని నాగ చైతన్యకి జంటగా.. థాంక్యూ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చతికిల పడింది. దాంతో మళ్ళీ తెలుగు చిత్రాలలో రాశికి అవకాశాలు రాలేదు. అదే సమయంలో కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాలు చేసే అవకాశం దక్కింది. కానీ, ఈ భాషలలో కూడా రాశి సక్సెస్ చూడలేకపోయింది.

Also Read – Pawan Kalyan-Harish Shankar: ఉస్తాద్ సర్‌ప్రైజ్..

ఈ నేపథ్యంలో హీరోయిన్‌గా ఎక్కడా సక్సెస్ దక్కని రాశి ఖన్నా కెరీర్‌ ముగిసినట్టే అని అంతా భావించారు. కానీ, లక్కీగా తెలుగులో సాలీడ్ గా రీ ఎంట్రీ దక్కింది. పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా.. హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమాలో రాశి సెకండ్‌ హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. మరోవైపు బాలీవుడ్‌లో యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కి జంటగా నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఇలా, ఈ బబ్లీ బ్యూటీ కొత్తగా వచ్చిన హీరోయిన్స్ తాకిడి తట్టుకోలేక కెరీర్‌లో బాగా వెనకబడిందనుకుంటున్న సమయంలో గేర్ మార్చి, స్పీడు పెంచేసింది.

ఏ హీరోయిన్‌కైనా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అదృష్టం కలిసొచ్చినట్టే. గతంలో శృతి హాసన్ ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాపవడంతో ఐరెన్ లెగ్ అని పేరు పెట్టారు. కానీ, గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఆమెకి తన పక్కన హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చి అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. గబ్బర్ సింగ్ సినిమాలో హీరోయిన్‌గా నిర్మాత వద్దన్నా.. పవన్ చెప్పడంతో ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమా సక్సెస్ తర్వాత శ్రుతి మళ్ళీ ఇప్పటి వరకూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఓజిలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్ మోహన్, ఉస్తాద్ లో హీరోయిన్స్‌గా నటిస్తున్న శ్రీలీల, రాశీఖన్నా కూడా ఇలాంటి సక్సెస్‌ఫుల్ కెరీర్ నే లీడ్ చేస్తారని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఇటీవల సక్సెస్ కోసం అల్లాడుతున్న ఈ ముగ్గురికి పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో.

Also Read – Kingdom: విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్‌కు కొత్త‌ క‌ష్టాలు.. మూవీని నిషేధించాలంటూ డిమాండ్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad