Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRaashii Khanna: పవన్‌పై ప్రశంసలు...

Raashii Khanna: పవన్‌పై ప్రశంసలు…

Raashii Khanna: బబ్లీ బ్యూటీ రాశీఖన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించింది. ఇంతకీ, రాశీ.. ఇలా సడన్‌గా పవన్ ని ఎందుకు ప్రశంసలతో ముంచేసింది. పవన్ సరసన జోడీ కట్టే అవకాశం ఇచ్చినందుకా.. లేక, మరో సినిమాలో ఛాన్స్ ఇస్తాడనే ఆశతో మాట్లాడిందా..? అసలు రాశి మనసులో ఏముంది..! ఈ వివరాలను ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

మద్రాస్ కేఫ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాశీఖన్నా, ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయింది. ఈ సినిమా హిట్ అందుకోవడంతో తెలుగులో వరుసగా అవకాశాలు వచ్చాయి. లక్కీగా రాశీ ఖన్నా నటించిన సినిమాలు చాలావరకూ హిట్ సాధించినవే. నాగ శౌర్య, సాయి దుర్గ తేజ్, అక్కినేని నాగ చైతన్య, గోపీచంద్, యంగ్ టైగర్ ఎన్‌టిర్ ఇలా చాలామంది స్టార్స్ తో నటించి క్రేజీ హీరోయిన్‌గా పాపులారిటీని సంపాదించుకుంది.

Also Read – Vijay Deverakonda: న్యూ లుక్ తో వరల్డ్ ఫెమస్ లవర్.. నిశ్చితార్థమే కారణమా!

అయితే, రాశీఖన్నా నటించిన ఆఖరి సినిమా పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత తెలుగులో అనూహ్యంగా వచ్చిన అవకాశమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్. ఒక హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా రాశీకి ఛాన్స్ దక్కింది. పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏ హీరోయిన్‌కైనా ఊహించని అవకాశమే. ఇక, ఆయనతో నటించాక ఖచ్చితంగా తమ అనుభవాలను పంచుకుంటుంటారు.

ఇటీవల ఓజీలో నటించిన ప్రియాంక అరుళ్ మోహన్, శ్రీయ రెడ్డి.. పవన్ ని పొగడ్తలతో ముంచేశారు. ఇప్పుడు రాశీఖన్నా కూడా పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పింది. “పవన్ కళ్యాణ్ చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారని, ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తారు, ఏదో ఒక పుస్తకం చదువుతుంటారు. ఆయనతో కలిసి పనిచేశాక ఆయన మానవత్వం, స్వభావం ఏంటో అర్థమైంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ షూట్ మొత్తం పూర్తైంది. నా సీన్స్ కొన్ని ఉన్నాయి”.. అని చెప్పుకొచ్చింది. ఇక హరీష్ శంకర్ కాల్ చేసి అడగగానే ఒక్క క్షణం ఆలోచించకుండా ఒప్పుకున్నానని రాశి తెలిపింది. ప్రస్తుతం రాశీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ALso Read – PV Sindhu: ‘వెండి బతుకమ్మ’తో పీవీ సింధు.. భర్తతో కలిసి కోలాటం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad