Tuesday, July 2, 2024
Homeచిత్ర ప్రభRaayan: హాఫ్ సెంచురీ కొడుతున్న స్టార్ హీరో

Raayan: హాఫ్ సెంచురీ కొడుతున్న స్టార్ హీరో

ధనుష్ 'రాయన్'

ధనుష్.. సౌత్ లో పరిచయం అక్కర్లేని సూపర్ స్టార్. రజనీకాంత్ అల్లుడుగానే కాదు.. వెరైటీ స్టోరీలు, డిఫరెంట్ మేకోవర్స్ తో వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ, బాక్సాఫీస్ లో మంచి ఇమేజ్ ఉన్న హీరోగా ఎదిగారు. ఇప్పటికే ధనుష్ ఓసారి మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేయగా.. లేటెస్ట్ గా తన హాఫ్ సెంచురీకి మైల్ స్టోన్ గా ఉండేలా రెండో సినిమాను ఆయన డైరెక్ట్ చేస్తుండటం విశేషం.

- Advertisement -

తెలుగు-తమిళంలో విడుదలవుతున్న రాయన్ ధనుష్ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోనుంది. ఇది ధనుష్ కు 50వ సినిమా కాగా ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ధనుష్ ఇందు కోసం సన్ పిక్చర్స్ తో జతకట్టారు. ఏఆర్ రెహమాన్ ‘రాయన్’ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు.

సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి ఫుట్-ట్యాపింగ్ మెలోడీ పీచు మిఠాయ్ పాట విడుదల కాగా ఈ పాట కూడా అప్పుడే వైరల్ అవుతోంది. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్ కాంట్రాస్ట్ ట్యూన్ చేశారు. ఇది గ్రూవీ బీట్‌లతో కూడిన రొమాంటిక్ మెలోడీ. ఇది స్లో పాయిజన్ లాగా ఇంజెక్ట్ అవుతుంది. సందీప్ కిషన్, అపర్ణ బాలమురుగన్ స్టీమీ రొమాన్స్ తో కూడిన ఈ పాటని విజయ్ ప్రకాష్ హరిప్రియ పాడిన తీరు మరింత స్పైసీ ని జోడించింది. రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఒకరికొకరు ప్రధాన జంట యొక్క రోమాన్స్ ని ఆకర్షణీయంగా వర్ణించింది. సందీప్ కిషన్ కి ఇది మరో చార్ట్ బస్టర్ సాంగ్.

రాయన్ కోసం ధనుష్ రెండోసారి మెగాఫోన్ పట్టారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. SJ సూర్య, సెల్వరాఘవన్, దుషార విజయన్ ఇతర ముఖ్య తారాగణం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఓం ప్రకాష్ కెమెరా హ్యాండిల్ చేస్తున్నారు. ప్రసన్న జికె ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్‌గా, పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.

జూన్ 13న రాయన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News