Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభSister Midnight Movie: ఇంత బోల్డ్ సీన్స్ రాధిక తప్ప ఇంకెవరూ చేయలేరు..రాత్రి మాత్రమే చూడండి

Sister Midnight Movie: ఇంత బోల్డ్ సీన్స్ రాధిక తప్ప ఇంకెవరూ చేయలేరు..రాత్రి మాత్రమే చూడండి

Radhika Apte: హీరోయిన్ అన్న తర్వాత నవరసాలు పలికించాల్సిందే. గత కొంతకాలంగా ఉమెన్ సెంట్రిక్ మూవీస్ వస్తున్నాయి. వాటిలో మితి మీరిన శృంగారం, కక్ష-ప్రతీకారం లాంటి హెవీ ఎమోషన్స్ ఉన్న సినిమాలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓటీటీ లో వచ్చే సినిమాలకి సెన్సార్ ఉండదు కాబట్టి ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉన్నా ప్రేక్షకులకి పండుగే. ఇలాంటి బోల్డ్ సీన్స్ చేయాలంటే మన సౌత్‌లో చాలా తక్కువమంది హీరోయిన్స్ ఉన్నారు. వారిలో రాధిక ఆప్టే, అమలా పాల్ లాంటి వారే ముందు గుర్తొస్తారు.

- Advertisement -

ఆమె సినిమాలో అమలా పాల్ ఒంటిపై నూలు పోగు లేకుండా నటించింది. ఈ సీన్స్ షూట్ చేసే సమయంలో దాదాపు 15 మంది ఆమె చుట్టూ ఉన్నారు. వారందరు నా భర్తల్లాంటి వారే అనుకొని ఎంతో ఒత్తిడితో నటించింది. అలా, రాధిక ఆప్టే కూడా శృంగార సన్నివేశాలలో నటించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ఇలాంటిదే ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు కొన్ని ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. అన్నీ భాషలలో కలిపి కనీసం పది సినిమాలైనా విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా థ్రిల్లర్ జోనర్ సినిమాలకి ఎక్కువగా ఆదరణ దక్కుతోంది. అలా ఇటీవల వచ్చిన సినిమా సిస్టర్ మిడ్‌నైట్. ఇందులో రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాకు కరణ్ కాందహారి దర్శకత్వం వహించగా, అశోక్ పాఠక్.. ఛాయా కదం.. స్మితా తాంబే కీలక పాత్రల్లో నటించారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/jabardasth-fame-satya-sri-in-bigg-boss-season-9-telugu/

ఈ ఏడాది మే 30న థియేటర్లలో విడుదలైంది. కాని, అంతగా ఈ సినిమాని పట్టించుకోలేదు. దాంతో రెండు వారాల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఉమా (రాధికా ఆప్టే) అనే మహిళ చుట్టూ తిరుగుతుంది. ఆమెది పెద్దలు కుదిర్చిన వివాహం. గోపాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని, ముంబైలోని ఒక స్లమ్‌ ఏరియాలో కాపురం పెడుతుంది. అయితే,ఉమకు ఈ వివాహం ఇష్టం ఉండదు. దాంతో ఆమె తన భర్తతో కాపురం చేయలేకపోతుంది. గోపాల్ ఒక ఇంట్రోవర్ట్ కావడంతో వాళ్ళిద్దరి మధ్య సంబంధం బలపడదు.

ఈ నేపథ్యంలో ఉమా లోపలున్న విపరీతమైన కోరికను అణచివేయలేక, ఈ విషయం బయటకు చెప్పలేక అటు మానసికంగా, ఇటు శారీరకంగా అనారోగ్యం బారినపడుతుంది. ధైర్యం చేసి ఓరోజు గోపాల్‌తో శారీరకంగా గడుపుతుంది. ఆ మరుసటి రోజు ఉదయం గోపాల్ చనిపోయి ఉంటాడు. ఈ వింత సంఘటన తర్వాత ఉమా జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది. ఆమె ఒంటరి ప్రయాణం ఎలా సాగింది అనేది మిగతా కథ. ఈ బోల్డ్ పాత్రలో రాధికా ఆప్టే పర్ఫార్మెన్స్ అద్భుతమని చెప్పాలి. తన నటనతో సినిమాను మోసింది. విమర్శకుల నుంచి రాధికకి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఒక స్లమ్ మహిళగా రాధిక కనపరిచిన ఎమోషన్స్ చాలా సహజంగా ఉన్నాయి. ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సంపాదించినప్పటికీ, సరైన పబ్లిసిటీ లేక ప్రేక్షకులకు చేరలేదు. డార్క్ కామెడీ, థ్రిల్లర్ జానర్‌లను ఇష్టపడే వారికి సిస్టర్ మిడ్‌నైట్ మూవీ బాగా నచ్చుతుంది. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూస్తే బావుంటుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌, గూగుల్‌ ప్లేలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. కాకపోతే మన ఇండియాలో ఈ సినిమా అందుబాటులో లేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News