Sunday, November 16, 2025
Homeచిత్ర ప్రభRag Mayur: 'అనుమాన పక్షి' డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు?

Rag Mayur: ‘అనుమాన పక్షి’ డైరెక్టర్ ఎవరు అనుకుంటున్నారు?

ANUMANA PAKSHI: సినిమా రంగంలో నిలదొక్కుకోవడానికి నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. సరైన పాత్ర దొరికితే చాలు, కెరీర్ ఒక్కసారిగా మారిపోతుంది. అలాంటి మంచి పాత్రల కోసం ఆరాటపడుతూ, దొరికిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నాడు యువ నటుడు రాగ్ మయూర్. ఎలాంటి రోల్స్‌నైనా మెప్పించే సత్తా ఉన్న ఈ నటుడు… ఇప్పుడు ఏకంగా ‘అనుమాన పక్షి’గా మారి, టాలీవుడ్‌లో కొత్త సంచలనం సృష్టించబోతున్నాడు!

- Advertisement -

చిన్నా పెద్దా తేడా లేదు: రాగ్ మయూర్ కెరీర్ గ్రాఫ్!

షార్ట్ ఫిలింస్‌తో ప్రయాణం మొదలుపెట్టిన రాగ్ మయూర్.. ‘సినిమా బండి’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘కీడా కోలా’, ‘శ్రీరంగ నీతులు’, ‘శుభం’ వంటి మంచి ప్రాజెక్టుల్లో, అలాగే ‘పరదా’ సివరపల్లి
సినిమాలోనూ కీలక పాత్రలు పోషించాడు. ‘మోడ్రెన్ లైఫ్ హైదరాబాద్’ వంటి సిరీస్‌లతో డిజిటల్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

చిన్నా పెద్ద పాత్రల గురించి ఆలోచించకుండా, తన నటనకు అవకాశం ఉన్న ప్రతి చోటా సత్తా చాటుతున్న రాగ్ మయూర్… ఇప్పుడు కెరీర్‌ను మలుపు తిప్పే పెద్ద ఆఫర్‌ను అందుకున్నాడు!

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kiran-abbavaram-kramp-new-song-tikkaltikkal-release/

‘అనుమాన పక్షి’ వెనుక ‘డీజే టిల్లు’ మాస్టర్ మైండ్!

రాగ్ మయూర్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ‘అనుమాన పక్షి’ అనే కావడం, ఆ టైటిల్‌తోనే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోవడం విశేషం. అయితే… ఈ సినిమాపై భారీ అంచనాలు పెరగడానికి అసలు కారణం… దర్శకుడు!

సంచలన డైరెక్టర్: ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది ఎవరో కాదు.. ‘డీజే టిల్లు’తో తెలుగు బాక్సాఫీస్‌ను ఊపేసిన డైరెక్టర్ విమల్ కృష్ణ! ‘డీజే టిల్లు’ తర్వాత హీరో సిద్ధు జొన్నలగడ్డ రేంజే మారిపోయింది. ఇప్పుడు విమల్ కృష్ణ, ఆ గ్యాప్‌ను బ్రేక్ చేస్తూ… రాగ్ మయూర్‌ను హీరోగా పెట్టి చేస్తున్న ఈ సినిమాపై సినీ వర్గాల్లో ‘మాస్టర్ ప్లాన్’ అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/rahul-ramakrishna-controversial-tweets/

విమల్ కృష్ణ డైరెక్షన్ అంటేనే ప్రేక్షకులకు కొత్త కథ, కొత్త ట్రీట్‌మెంట్ ఉంటుందనే అంచనా ఉంది. మరి, ఈ అనుమాన పక్షి టైటిల్‌లో ఉన్న డిఫరెంట్ ఎలిమెంట్ ఏంటి? ఈ సినిమాతో రాగ్ మయూర్ కూడా సిద్ధు జొన్నలగడ్డ స్థాయిలో బ్రేక్ అందుకుంటాడా? అన్నది చూడాలి!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad