Kanchana 4: కొన్ని సినిమాలకి ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది ఎంతో కీలకంగా మారుతుంది. ప్రస్తుతం మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో హీరో రేంజ్ ని బట్టి భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇక కాంబినేషన్ సాలీడ్ గా ఉంటే థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. అలాగే, ఫ్రాంఛైజీస్ కి ఇటు తెలుగులో అటు తమిళం, కన్నడ భాషలలో నెవర్ బిఫోర్ అన్నట్టుగా బిజినెస్ జరుగుతోంది.
ఈ మధ్య మన తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, హరిహర వీరమల్లు.. అలాగే, మన శంకరవరప్రసాద్ గారు సినిమాలకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. తమిళంలో రనిజీకాంత్ నటించిన కూలీ సినిమా, కన్నడ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార 1 సినిమాల బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అయిన రాఘవ లారెన్స్ నటిస్తున్న కాంచన 4 కి ఇంకా షూటింగ్ పూర్తి కాకుండానే రూ.100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.
Also Read – Krithi Shetty: రెడ్ శారీలో కృతి శెట్టి.. సొగసు చూడతరమా
ముని సినిమాతో హర్రర్ జానర్ కి కామెడీ ఎలిమెంట్స్ జోడించి ఫ్రాంఛైజీస్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు రాఘవ లారెన్స్. తెలుగులో నాగార్జున హీరోగా మాస్, డాన్ సినిమాలను రూపొందించి హిట్స్ ఇచ్చాడు. అలాగే, ప్రభాస్ తో రెబల్ సినిమాను తీసిన రాఘవ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. కానీ, ముని.. కాంచన సిరీస్ లో వచ్చిన గంగ, శివలింగ, కాంచన 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురింపించాయి.
రజినీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ చంద్రముఖి సినిమా సీక్వెల్ ని రాఘవ చేశాడు. కానీ, ఈ సినిమా కలిసి రాలేదు. మళ్ళీ తనకి బాగా కలిసొచ్చిన సిరీస్ లో 4వ భాగంగా కాంచన 4 ని రెడీ చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే కీలక పాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహీ నటిస్తున్నారు. దీంతో నార్త్ లో మంచి డిమాండ్ ఏర్పడిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ రైట్స్ పరంగా రూ.50 కోట్లు, హిందీ రైట్స్ కోసం రూ.50 కోట్ల వరకూ బిజినెస్ పూర్తైందట. ఇదే నిజమైతే లారెన్స్ కి కాంచన 4 మంచి కమర్షియల్ సక్సెస్ ని ఇవ్వడం గ్యారెంటీ అని చెప్పుకోవచ్చు.
Also Read – ICC World Cup 2025: చారిత్రక విజయం.. మహిళా క్రికెటర్లకు టాటా మోటార్స్ భారీ బహుమతి


