Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభRaghava Lawrence: ‘కాంచన 4’ క్రేజీ అప్‌డేట్

Raghava Lawrence: ‘కాంచన 4’ క్రేజీ అప్‌డేట్

Raghava Lawrence Kanchana 4: కొరియోగ్రాఫర్‌గా సౌత్ అండ్ నార్త్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్‌. ఆ తర్వాత ఆయన దర్శకుడిగా.. హీరోగా మారి సినిమాలను చేస్తున్నారు. అక్కినేని నాగార్జునతో మాస్, డాన్ చిత్రాలను తీయడమే కాకుండా డాన్ సినిమాలో నాగ్ తమ్ముడిగానూ అలరించాడు. అంతేకాదు, డార్లింగ్ ప్రభాస్‌తోనూ రెబల్ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా ఒక్క ఫైట్ మాత్రం ఇప్పటికీ చాలా సినిమాలకి ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. ఈ సిరీస్ తర్వాత సౌత్ భాషలలో మాత్రమే కాదు, హిందీలోనూ కామెడీ అండ్ హర్రర్ జోనర్‌లలో సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి.

- Advertisement -

రాఘవ లారెన్స్ ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ కొరియోగ్రఫీ అందించాడు. ఆ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్. ఇక ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంచన ప్రాంచైజీ సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజీ తమిళ ప్రేక్షకుల్లోనే కాదు, తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ముని నుంచి వచ్చిన ప్రతి సినిమా తెలుగులో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కమర్షియల్ సక్సెస్‌ను సాధించాయి.

Also Read- Ruhani Sharma: అర్థనగ్న అందాలతో అదరగొట్టిన కోహ్లీ మరదలు..కుర్రాళ్లు చూస్తే తట్టుకోవడం కష్టం..

అంతేకాదు, స్మాల్ స్క్రీన్ మీద కూడా కాంచన ప్రాంచైజీ మంచి టీఆర్పీ రేటింగ్‌ను నమోదు చేసింది. ఈ క్రమంలో తమిళ్‌తో పాటు తెలుగు మార్కెట్‌లో సమానంగా వసూళ్లు రాబట్టిన ఈ కాంచన ప్రాంచైజీ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాంచన 4 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ కు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌ కోలీవుడ్ మీడియా నుంచి అందుతోంది. కాంచన 4 లో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో కామెడీ, హర్రర్ అంతకు మించి ఉండబోతున్నట్లుగా టీమ్ చెబుతోంది.

తాజాగా కాంచన 4 మహాబలిపురం షెడ్యూల్‌ను పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. ఆగస్టులో ఈ చిత్రాన్ని పూర్తి చేసే విధంగా చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కాంచన 4 సినిమా విడుదల తేదీని కూడా అఫీషియల్‌గా త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాకి హిందీ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లోనూ భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇక తాజాగా పూర్తైన షెడ్యూల్‌లో లారెన్స్ రాఘవ, పూజా హెగ్డేలతో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొన్న కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. కాంచన 4లో లారెన్స్ గెటప్ చాలా స్పెషల్‌గా ఉంటుందని ఫస్ట్ లుక్‌తోనే అర్థమైంది. ఈసారి వచ్చే మూవీ పాన్ ఇండియా వైడ్‌గా రిలీజై ఎలాంటి సంచలనాలను సృష్ఠిస్తుందో చూడాలి.

Also Read- Keerthi suresh new projects: వరుస చిత్రాలతో కీర్తీ దూకుడు.. రౌడీ బాయ్ సినిమా ఆఫర్ కూడా..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad