Sunday, October 6, 2024
Homeచిత్ర ప్రభRaghavendra Rao : ఆర్కెస్ట్రా గ్రూపులో డ్రమ్స్ వాయించాడు.. ఇప్పుడు మాస్ మహారాజ అయ్యాడు..

Raghavendra Rao : ఆర్కెస్ట్రా గ్రూపులో డ్రమ్స్ వాయించాడు.. ఇప్పుడు మాస్ మహారాజ అయ్యాడు..

- Advertisement -

Raghavendra Rao : రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో టిజి విశ్వప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ధమాకా. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో చేస్తున్నట్టు సమాచారం. ధమాకా సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నడూ లేనంతగా మొదటిసారి రవితేజ వీర లెవల్లో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు.

తాజాగా ఆదివారం నాడు ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ ఈవెంట్ లో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు నేను డైరెక్షన్ చేసిన అల్లరి ప్రియుడు సినిమాలో ఆర్కెస్ట్రా గ్రూపులో ఒకడిగా వచ్చాడు రవితేజ. ఆ గ్రూపుతో వచ్చి డ్రమ్స్ వాయించాడు. అప్పుడు అతన్ని చూసినప్పుడే ఈ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ లో బాగా ఎదుగుతాడు అనుకున్నాను. ఇవాళ ఇలా మాస్ మహారాజ అయ్యాడు అని తెలిపారు.

అలాగే త్వరలోనే రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు అని రాఘవేంద్రరావు చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్లు రవితేజ కొడుకు ఎప్పుడు హీరోగా కనిపిస్తాడా అని చాలా మంది అనుకున్నారు. ధమాకా ఈవెంట్ లో రాఘవేంద్రరావు ఈ విషయం చెప్పడంతో కన్ఫర్మ్ అని ఫిక్స్ అయ్యారు అంతా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News