Rahul Ravindran: నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రీసెంట్ గా మంగళసూత్రం గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా పెద్ద చర్చకు దారి తీశాయి. సంప్రదాయాలు, ముఖ్యంగా తాళి ధరించాలనే దానిపై తను చేసిన వ్యాఖ్యలు. రాహుల్ లేటెస్ట్ మూవీ గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో తన భార్య తాళి బొట్టు గురించి మాట్లాడుతూ, తన భార్య చిన్మయి విషయంలో తాను తాళి వేసుకోవాలని ఎప్పుడూ బలవంతం చేయలేదని, అది పూర్తిగా తన ఇష్టం అని చెప్పుకొచ్చాడు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా మందికి కోపం తెప్పించాయి, మరికొందరు మాత్రం రాహుల్ ఆలోచనను సమర్థించారు. ఈ కామెంట్లు బాగా వైరల్ అవ్వడంతో, కొందరు నెటిజన్లు రాహుల్‌పై గౌరవం పోయిందని, సంప్రదాయాలను కించపరుస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ: Peddi: చికిరి చికిరి’ సాంగ్ అప్డేట్.. రెహమాన్ మ్యూజిక్, చరణ్ డాన్స్!
భర్తకు మద్దతుగా రంగంలోకి చిన్మయి!
తన భర్త రాహుల్‌పై విమర్శలు ఎక్కువవ్వడంతో, చిన్మయి శ్రీపాద ఈ విషయంలో గట్టిగా స్పందించింది. ఆమె రాహుల్‌కు మద్దతుగా. “మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను, వేధింపులను అస్సలు ఆపలేదు” అని తన సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. దీంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. చిన్మయి, రాహుల్ ఇద్దరూ తమ వ్యక్తిగత అభిప్రాయాలను బలంగా చెప్పడంతో, సోషల్ మీడియాలో సంప్రదాయాలు, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ అనే విషయాలపై కొత్త డిబేట్ మొదలైంది.
తాళి వేసుకోవడం తన ఇష్టం!
భార్యాభర్తల బంధం అనేది ఒక దారంపై ఆధారపడి ఉండదు అని . అది ఇద్దరి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, గౌరవం మీద ఆధారపడి ఉంటుంది అని. అందుకే, తాళి ధరించాలా వద్దా అనేది పూర్తిగా ఆ మహిళ వ్యక్తిగత ఇష్టం మీద ఆధారపడి ఉండాలి, అది బలవంతం కాకూడదు అని రాహుల్ చెప్పాడు. మహిళలను బంధించే విధంగా తాళిని చూడకూడదు అని అంటదు రాహుల్.
ALSO READ: Raviteja: వరుసగా ఐదు ప్లాప్‌లు, “ఇలా అయితే కష్టం” అంటున్న ఫ్యాన్స్!
ఈ మొత్తం విషయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. కొంతమంది తాళి అనేది కేవలం ఒక నమ్మకం, దాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు అంటుంటే, మరికొందరు ఈ రోజుల్లో ఇలాంటి సంప్రదాయాలు వ్యక్తిగత విషయాలు, ఎవరి ఇష్టం వాళ్లది అని అంటున్నారు. ఏదేమైనా, రాహుల్, చిన్మయి ఇద్దరూ కలిసి ఈ సంప్రదాయంపై చర్చను సోషల్ మీడియాలో వైరల్ చేసారు.


