RahulSipligunj-Marriege: ఆస్కార్ అవార్డు విజేత , బిగ్‌బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సైలెంట్ గా తన ప్రేయసీతో నిశ్చితార్థం చేసుకున్నాడు.హైదరాబాద్‌కు చెందిన హరిణ్యా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫొటోలు షికారు చేస్తున్నాయి.
ఆదివారం సాయంత్రం సన్నిహితులు, బంధువుల సమక్షంలో చాలా సాధారణంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకను జరిపారు. బయటకు ఏ సమాచారం రాకపోయినా, వేడుక ముగిసిన కొద్దిసేపటికి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్ అయ్యాయి.
నిశ్చితార్థం సందర్భంగా రాహుల్ ధరించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. పాస్టెల్ లావెండర్ రంగులో ఉన్న షేర్వానీ ఆయన లుక్‌కు ప్రత్యేక ఆకర్షణ కలిగించింది. మరోవైపు హరిణ్యా రెడ్డి నారింజ రంగు లెహంగా ధరిస్తూ అందరినీ మెస్మరైజ్ చేసింది. ఈ జంటను చూసిన వారంతా సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు వారిని నిజంగా ఒకరికి ఒకరు తగ్గ జంటగా అభివర్ణిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
గత ఐదారు సంవత్సరాలుగా..
ఇప్పటివరకు రాహుల్ తన పెళ్లి గురించి గత ఐదారు సంవత్సరాలుగా అనేక రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. తరచూ మీడియాలో ఈ ప్రశ్న ఎదురైనా, రాహుల్ మాత్రం మౌనంగానే ఉండేవాడు. అకస్మాత్తుగా నిశ్చితార్థం వార్త బయటకు రావడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అనుకోకుండా వచ్చిన ఈ అప్డేట్‌తో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
సోషల్ మీడియా అకౌంట్లలో..
ఈ వేడుకలో రాహుల్ స్వయంగా ఎలాంటి ఫోటోలు లేదా వివరాలు తన సోషల్ మీడియా అకౌంట్లలో పంచుకోలేదు. అయినప్పటికీ, అక్కడికి హాజరైన కొందరు తీసిన చిత్రాలు బయటకు వచ్చి కాసేపట్లోనే వైరల్ అయ్యాయి. ఒకవైపు అభిమానులు ఈ ఫోటోలను విస్తృతంగా షేర్ చేస్తుంటే, మరోవైపు ఆయన పెళ్లి తేది ఎప్పుడనేది తెలుసుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
ఆస్కార్ అవార్డు పొందిన “నాటు నాటు” పాట రాహుల్ కెరీర్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాట సంచలనం సృష్టించగా, రాహుల్ పేరు ఇంటింటా వినిపించింది. ఆయన సాధించిన ఈ విజయమే కాకుండా ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త ఆరంభం చేయడం ఆయన అభిమానులను ఆనందపరిచే అంశమైంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/kanappa-movie-ott-release-update-on-amazon-prime/
నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి తేదీ ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే కుటుంబ సభ్యులు పెళ్లి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.


