Su From So OTT: కన్నడ సినిమా ‘సు ఫ్రం సో’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. కేవలం 5.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, రూ. 115 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. రాజ్ బి శెట్టి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించడమే కాక, నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించారు. తుమినాడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ సినిమా, జులై 25, 2025న విడుదలై అనూహ్య స్పందన పొందింది. పెద్దగా ప్రచారం లేకపోయినా, కంటెంట్ బలంతో ప్రేక్షకులను ఆకర్షించి, కన్నడలో రూ. 75 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది.
ALSO READ: deeksha bharatanatyam Record: 170 గంటల పాటు భరతనాట్యం.. గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
ఈ సినిమా కథ అశోక్ అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ప్రేమించిన అమ్మాయిని కలవడానికి ఆమె ఊరు వెళ్లిన అశోక్, అక్కడ ఊహించని పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి తనకు దెయ్యం పట్టిందని అబద్ధం చెబుతాడు. ఈ అబద్ధం అతన్ని ఎలాంటి తమాషా పరిస్థితుల్లోకి నెట్టిందనేది కథ ఉత్కంఠగా సాగుతుంది. రాజ్ బి శెట్టి నటన, తుమినాడ్ దర్శకత్వం, హాస్యం కలగలిపిన కథనం ఈ సినిమాను హిట్‌గా నిలిపాయి.
ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 5, 2025 నుంచి ‘జియో హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తక్కువ బడ్జెట్‌తో భారీ విజయం సాధించిన ఈ సినిమా, కన్నడ చిత్ర పరిశ్రమలో కొత్త ఒరవడిని సృష్టించింది. కామెడీ, ఎమోషన్, డ్రామా కలబోసిన ‘సు ఫ్రం సో’ ఓటీటీలోనూ అదే జోష్ చూపించనుంది!


