Malavika Mohanan: ప్రభాస్ రాజాసాబ్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌తో పాటు మరో మెయిన్ లీడ్‌గా కనిపించబోతున్నది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ మూవీతో తెలుగులో తన లక్‌ను పరీక్షించుకోబోతున్నది.
విజయ్ దేవరకొండతో…
రాజాసాబ్ కంటే ముందే మాళవికా మోహనన్ తెలుగులో ఓ సినిమా అంగీకరించింది. అది కూడా విజయ్ దేవరకొండతో. గ్రాండ్‌గా లాంఛ్ అయిన ఈ మూవీ ఆ తర్వాత ఆగిపోయింది. డియర్ కామ్రేడ్ రిలీజ్ తర్వాత హీరో పేరుతో తెలుగు, తమిళ భాషల్లో ఓ బైలింగ్వల్ మూవీని అనౌన్స్ చేశాడు విజయ్ దేవరకొండ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందనున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఆన్నామలై ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. మాళవికా మోహనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు డైరెక్టర్ కొరటాల శివ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, మాళవికా మోహనన్‌లపై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టారు.
Also Read – Motion Sickness: జర్నీలో వాంతులు వస్తాయా?.. ఈ హోమ్ రెమెడీస్ పాటించాల్సిందే!
కన్నడ నటుడు…
ఈ సినిమా ద్వారా కన్నడ నటుడు దిగంత్ మచాలే కీలక పాత్రలో నటించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రదీప్ కుమార్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించారు. షూటింగ్ ప్రారంభమవ్వడమే తరువాయి అనే టైమ్‌లోనే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాను విజయ్ దేవరకొండ పక్కనపెట్టేశారు.
రాజాసాబ్‌తో…
అలా విజయ్ మూవీతో టాలీవుడ్‌లోకి డెబ్యూ ఇచ్చే ఛాన్స్‌ను మాళవికా మోహనన్ మిస్సయ్యింది. హీరోయిన్ ఛాన్స్ మిస్సయిన నాలుగేళ్ల తర్వాత రాజాసాబ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆమె కల తీరబోతుంది. రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంజయ్‌దత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. డిసెంబర్ 5న పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
Also Read – Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ సెన్సార్ పూర్తి: రన్ టైమ్ ఫిక్స్


