Prabhas – Maruthi: సినీ ఇండస్ట్రీని కొన్నేళ్లుగా పీడిస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. సినిమా విడుదలైన గంటలోనే దాని పైరసీ బయటకు వచ్చేస్తోంది. ఈ సమస్యే తీరడం లేదని దర్శక నిర్మాతలు బాధలు పడుతుంటే.. ఇప్పుడు మరో సమస్య వచ్చింది. అదే లీకులు. ఓ సినిమా సెట్స్ పై ఉండగానే దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చేస్తున్నాయి. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు చేస్తున్న నిర్మాతలకు ఇది శరాఘాతంగా మారింది. చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా అన్నీ సినిమాలను లీకేజీ రాయుళ్ల సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు.
తాజాగా పాన్ ఇండియా మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ది రాజా సాబ్’ విషయంలో మేకర్స్‌కు ఇదే సమస్య ఎదురైంది. వివరాల్లోకెళ్తే.. రీసెంట్‌గా ది రాజా సాబ్ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆ టీజర్ అఫిషియల్‌గా బయటకు రాక ముందే, అంటే మూడు రోజుల ముందే సోషల్ మీడియాలో లీక్ కావటం చిత్ర యూనిట్‌ను షాక్‌కి గురి చేసింది. దీనిపై టీమ్ సీరియస్‌గానే చర్యలు తీసుకోవాలనుకుంటోంది. అందుకోసం చిత్ర యూనిట్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రాజా సాబ్ టీమ్‌కి సంబంధించిన డబ్బింగ్ ఇంచార్జ్ వసంత్ కుమార్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. మరి పోలీసులు దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/suriya-45-titled-as-karuppu/
ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ హారర్ ఫాంటసీ మూవీగా ‘ది రాజా సాబ్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు. హై క్వాలిటీ వీఎఫ్‌ఎక్స్ అందించడానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. కథను, ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తోంది. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్స్‌నే చేస్తోన్న ప్రభాస్ ఈసారి రూట్ మార్చి రాజా సాబ్ చేస్తున్నారు. ఫాంటసీ హారర్ కామెడీ జోనర్‌లో డార్లింగ్ నటించటం ఇదే తొలిసారి అవుతుంది. ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. మారుతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 5న తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.


