Tollywood: హారర్ జానర్‌కు ట్రెండ్‌తో సంబంధం ఉండదు. ఆడియెన్స్‌ను భయపెడితే చాలు బాక్సాఫీస్ వద్ద హారర్ కథలు కాసుల వర్షం కురిపిస్తాయి. హారర్ సినిమాలను మినిమం గ్యారెంటీగా చెబుతుంటారు. మిగిలిన జానర్స్‌తో పోలిస్తే హారర్ సినిమాల సక్సెస్ రేటు ఎక్కువే. ఇదివరకు హారర్ సినిమాలపై స్టార్స్ అంతగా ఆసక్తిని చూపించేవారు కాదు. ఎక్కువగా మిడ్‌రేంజ్, చిన్న హీరోహీరోయిన్లు మాత్రమే హారర్ సినిమాల్లో నటించేవాళ్లు. హారర్ సినిమాలు వందల కోట్లను వసూళ్లు చేస్తుండటంతో ఈ కథలపై స్టార్స్ మనసు పడుతున్నారు. హారర్ సినిమాలతో ఆడియెన్స్‌ను భయపెట్టడానికి రెడీ అంటున్నారు. ప్రజెంట్ టాలీవుడ్‌లోని కొందరు టాప్ స్టార్స్ ఫస్ట్ టైమ్ హారర్ కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు..ఆ హీరోహీరోయిన్లు ఎవరంటే?
ప్రభాస్ రాజాసాబ్…
రాజాసాబ్‌తో హారర్ జానర్‌లోకి రెబల్‌స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న ఈ తొలి హారర్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రాజాసాబ్‌పై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ మూవీలో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్‌తో పాటు రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హవేలి మహాల్ అనే రాజభవనం బ్యాక్‌డ్రాప్‌లో రాజాసాబ్ మూవీ సాగనున్నట్లు సమాచారం. డిసెంబర్ 5న రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కిష్కిందపురి…
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన కిష్కిందపురి సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతుంది. తెలుగులో అనుపమ పరమేశ్వరన్ చేస్తున్న ఫస్ట్ హారర్ మూవీ ఇది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. కిష్కిందపురితో కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. సువర్ణమాయ అనే ప్యాలెస్ చుట్టూ కిష్కిందపురి కథ సాగనున్నట్లు టీజర్ ద్వారా మేకర్స్ హింట్ ఇచ్చారు.
Also Read – Redmi 15 5G: 7000mAh బిగ్ బ్యాటరీ, 50MP రియర్ కెమెరాలతో రెడ్మీ 15 5G వచ్చేసిందోచ్..ధర ఎంతంటే..?
కొరియన్ కనకరాజు…
కెరీర్‌లో ఇప్పటివరకు కామెడీ, యాక్షన్ సినిమాలు చేసిన మెగా హీరో వరుణ్ తేజ్ కూడా హారర్ జానర్‌లోకి అడుగుపెట్టాడు. కొరియన్ కనకరాజు పేరుతో ఓ హారర్ కామెడీ మూవీ చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
రష్మిక ఫస్ట్ హారర్ మూవీ..
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా మొదటిసారి ఓ హారర్ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టబోతుంది. థామా పేరుతో బాలీవుడ్‌లో హారర్ మూవీ చేస్తుంది రష్మిక. ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో తడాఖా అనే క్యారెక్టర్‌లో రష్మిక కనిపించబోతున్నది. ఆదిత్య సర్ఫోట్ధర్ దర్శకత్వం వహిస్తున్న థామా మూవీలో ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్ధీన్ సిద్ధిఖీ హీరోలుగా నటించారు.
అల్లరి నరేష్ హారర్ మూవీ…
అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ హారర్ కాన్సెప్ట్‌తో ఫస్ట్ టైమ్ 12ఏ రైల్వే కాలనీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ఇంట్లో దయ్యం నాకే భయం పేరుతో ఓ హారర్ కామెడీ మూవీ చేశాడు అల్లరి నరేష్.
Also Read – Smart Phones Under 7K: రూ.7వేల లోపు లభించే 3 బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు..


