SSMB 29 Updates: RRR సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. బాహుబలి, ట్రిపులార్ వంటి చిత్రాలతో ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ జకన్న నెక్ట్స్ మూవీ గురించి యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో దర్శకధీరుడు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్‌కి కాస్త గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఇప్పుడు కొత్త షెడ్యూల్ షూటింగ్‌ను ప్రారంభించారు. సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలోని దట్టమైన అడవుల్లో జరుగుతోంది. అక్కడ ఒక పాటతో పాటు భారీ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దట్టమైన అడవుల్లో క్రూర మృగాల మధ్య ఒక ఛేజ్ సీన్ ఉండబోతుందని తెలుస్తోంది. RRR సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్‌ను మించిన యాక్షన్ ఎపిసోడ్‌ను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు తెలుగు సినిమాలకే పరిమితమైన మహేష్.. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, ఒరిస్సాల్లో కొంత షూటింగ్‌ను పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్‌ను కెన్యాలో చేయటానికి ప్లాన్ చేశారు మేకర్స్. ఈ షెడ్యూల్ కోసం ఏర్పాట్లన్నీ రెండు నెలల ముందే పూర్తి చేసుకున్నారు. అయితే, కెన్యాలో జరుగుతున్న నిరసనల కారణంగా ఈ షెడ్యూల్‌ను పోస్ట్ పోన్ చేసి సౌతాఫ్రికాలో చిత్రీకరిస్తున్నారు.
SSMB 29 చిత్రం ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ యాక్షన్ సినిమాగా రూపొందుతోంది. మహేష్ బాబుతో పాటు, ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), ఆర్ మాధవన్ (R Madhavan) వంటి ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
SSMB 29 కోసం రాజమౌళి వారణాసి (Vaaranasi) అనే టైటిల్‌ను కూడా అనుకున్నారు. అయితే అది మరో దర్శకుడు రిజిష్టర్ చేశాడని, సదరు దర్శకుడిని టైటిల్ కోసం కాంటాక్ట్ అయితే తన టైటిల్‌ను SSMB 29 కోసం ఇవ్వలేనని చెప్పేసినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ సహా అందరినీ మెప్పించేలా డాన్స్ నెంబర్ ఉండబోతుందని కూడా సమాచారం. దీని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన మార్కెట్ సెట్ సూపర్‌స్టార్‌పై జక్కన్న సోలో సాంగ్‌ను చిత్రీకరించినట్లు టాక్.
ALSO READ : https://teluguprabha.net/cinema-news/director-bobby-mega-158-movie-announced-on-chiranjeevi-birthday/
SSMB 29 చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్‌లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది.


